దంతాలను శుభ్రం చేసుకునేందుకు మనకు మార్కెట్‌లో అనేక రకాల టూత్‌పేస్టులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన టూత్ పేస్టును కొనుగోలు చేసి దాంతో దంతధావనం చేస్తుంటారు. అయితే నిజానికి ఎవరైనా సరే.. ఏ టూత్‌పేస్టు పడితే దాన్ని వాడకూడదు. తమకు ఉన్న దంత సమస్యలకు అనుగుణంగా టూత్‌పేస్టులను వాడాలి. మరి ఏయే రకాల దంత సమస్యలు ఉన్నవారు ఎలాంటి టూత్‌పేస్టులను వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
* దంత క్షయం (కావిటీలు) సమస్యలు ఉన్నవారు తమ వాడే టూత్‌పేస్టులో సోడియం ఫ్లోరైడ్ ఉండేలా చూసుకోవాలి. దీంతో ఆ రసాయనం మీ దంతాలను రక్షిస్తుంది. దంత సమస్యలు తగ్గుతాయి. ఇక ఈ తరహా టూత్‌పేస్ట్‌ను పిల్లలు వాడకుండా చూడాలి. లేదంటే వారికి దంత సమస్యలు వస్తాయి.
* బాగా వేడిగా లేదా బాగా చల్లగా ఉన్న పదార్థాలను తింటే కొందరికి దంతాలు తీపులు వచ్చినట్లు అవుతాయి. అలాంటి వారు డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ వాడాలి. దీంతో ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
* చిగుళ్లలో నొప్పి ఉండి, చిగుళ్లు రక్తం కారుతూ ఉండేవారు Anti-gingivitis టూత్ పేస్ట్ వాడితే ఫలితం ఉంటుంది. దాంతో ఆయా సమస్యలు తగ్గుతాయి.
* కొందిరికి నాలుకపై పాచి ఎక్కువగా తయారవుతుంటుంది. అలాంటి వారు Tartar-control తరహా టూత్‌పేస్టు వాడితే ఫలితం ఉంటుంది. దీంతో నోట్లో ఉండే బాక్టీరియా నశించి నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది.
* అయితే దంత సమస్యలు లేని వారు మాత్రం టీత్ వైటెనింగ్ టూత్ పేస్ట్‌ను వాడితే మంచిది. దాంతో దంతాలు తెల్లగా మారుతాయి. ఇక పైన చెప్పిన సమస్యలు కలిగిన వారు ఆయా టూత్ పేస్ట్‌లను వాడితే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.