ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న డిజిటల్ ట్రేడింగ్ ముఠా గుట్టురట్టు.. 53 మంది అరెస్టు

-

ఆన్‌లైన్‌లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న డిజిటల్ ట్రేడింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు వివరాలు వెల్లడించారు.డిజిటల్ ట్రేడింగ్ గ్రూప్‌లో మోసాలకు పాల్పడుతున్న వారిలో వివిధ బ్యాంకులకు సంబంధించిన అధికారుల ప్రమేయం ప్రత్యక్షంగా ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు.

ఈ కేసులో ఓ బ్యాంకు మేనేజర్‌ సహా 52 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.ఓ కేసులో రూ.93 లక్షల ట్రేడింగ్ స్కాం జరిగిందని, ఇండియాతో పాటు నేపాల్, చైనా సహా 3 ప్రాంతాల్లో విస్తరించిందని వివరించారు. ఇందులో శుభమ్ కుమార్ జా, డిప్యూటీ మేనేజర్, రషీద్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ యాక్సిస్ బ్యాంక్, ఆర్ మోహన్ ఫాబ్రికేషన్ బిజినెస్ ఓనర్ బెంగుళూరుకు చెందిన వారు ఈ కేసులో ఉన్నారని చెప్పారు. అధిక లాభాలు ఆశ చూపి ట్రేడింగ్ పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారని విచారణలో గుర్తించినట్లు సీపీ తెలిపారు. తెలంగాణ పోలీసులు కష్టపడి రూ. 23 కోట్ల స్కామ్‌కు పాల్పడిన వారిని అరెస్ట్ చేసినట్లు సీవీ ఆనంద్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version