మహా కుంభమేళాలో భక్తులు మృతి.. రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ !

-

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఆ కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని, గాయపడినవారికి సరైన వైద్యం అందించాలని కోరారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Devotees died in Maha Kumbh Mela Revanth Reddy’s tweet

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా కల్పించారు సీఎం రేవంత్‌ రెడ్డి. కాగా… యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో కొనసాగుతున్న మహాకుంభమేళాలో తీవ్ర విషాదం నెలకొంది. అనుకోకుండా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. వందకు పైగా భక్తులు మృతి చెందినట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version