తెలంగాణలో టికెట్ రేట్లు పెంచాలని రేవంత్‌ రెడ్డిని అడుగుతా – దిల్‌ రాజు

-

తెలంగాణలో టికెట్ రేట్లు పెంచాలని రేవంత్‌ రెడ్డిని అడుగుతా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గేమ్‌ చేంజర్‌ నిర్మాత దిల్‌ రాజు. గేమ్‌ చేంజర్‌ గురించి ఇవాళ మాట్లాడుతూ…. టికెట్ రేటు పెంచడం వల్ల 18 పర్సెంట్ గవర్నమెంట్ కు వెళుతుందని… భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వాల సహాయం ఉండాలని కోరారు. అలాగే ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ చేశారని తెలిపారు.

dil raju revanth game changer

తెలంగాణా సీఎం గారు సినీ ఇండస్ట్రీకి అన్ని ఇస్తాను అన్నారు ఆ ఆశతో మళ్లీ రేవంత్‌ రెడ్డిని కలుస్తానని ప్రకటించారు. తెలుగు సినిమా భారీ స్థాయిలో రూపొందుతున్నాయి అందుకే ప్రపంచ ఖ్యాతి వచ్చిందన్నారు గేమ్‌ చేంజర్‌ నిర్మాత దిల్‌ రాజు. అటు గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు యువకుల మృతి పై స్పందించిన నిర్మాత దిల్ రాజు… ఇలాంటివి జరుగుతాయి అనే పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్దు అన్నారు.. నేను చరణ్ కావాలని రిక్వెస్ట్ చేశామన్నారు. వారి కుటుంబానికి రూ.5 లక్షలు సాయం వెంటనే పంపిస్తానని తెలిపారు నిర్మాత దిల్ రాజు.

Read more RELATED
Recommended to you

Exit mobile version