సంచలనం సృష్టించబోతున్న దిల్ రాజు ఇంటర్వ్యూ.!

-

తెలుగు సినిమా పరిశ్రమ లో దిల్ రాజు పేరు పరిచయం అక్కర్లేదు. చిన్న డిస్ట్రిబ్యూటర్ గా మొదలు పెట్టి ప్రస్తుతం పెద్ద నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు.ఇక ప్రస్తుతం దిల్ రాజు పేరు మీడియాలొ హాట్ టాపిక్ గా మారింది. తన వారసుడు సినిమా రిలీజ్ విషయంలో వివాదాలు వెంటాడుతూ ఉన్నాయి.

ఇక ప్రస్తుతం  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణతో చేసిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం ప్రోమోలో కనిపించారు. అసలే వివాదాలు నడుస్తున్న కాలంలో ఈ ప్రోమో రావటం తెలుగు సినిమా పరిశ్రమ లో సంచలనంగా మారింది. దీనిలో చాలా విషయాలపై కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడినట్లు కనబడుతోంది.

ఇందులో తనకు చాలా మంది ఆరోపిస్తున్నట్లు ఎక్కువ థియేటర్స్ లేవని నాకు 37 థియేటర్స్ మాత్రమే ఉన్నాయని అన్నారు. అలాగే తన సినిమా ను అడ్డుకునే పరిశ్రమ పెద్ద మనుషులు ఎవరో తనకు తెలుసని చెప్పారు. పైకి మాత్రం మేమంతా ఒక్కటే అని చెబుతాం అంటాము కాని ఎవరి దారి వారిదే అంటూ ఒపెన్ గా చెప్పారు. అలాగే సినిమా అంటే ఒక మాయ అని , ఇక్కడ చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని తెలిపారు.సినిమా అంటే సిగ్గు నీతి మానం లేనిదే అంటూ పరిశ్రమ గురించి చెప్పుకొచ్చారు. ఇక ప్రోమోనే ఇలా ఉంటేనే ఇక అసలైన ఇంటర్వ్యూ  ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version