ఏ సినిమాను తొక్కాలని నేను చూడలేదు – దిల్ రాజ్ సంచలనం

-

కార్తికేయ 2 సినిమా విజయ వంతంగా థియేటర్లలో నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా వాస్తవానికి జులైలో రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ ఆగస్ట్‌ 12వ తేదీన రిలీజ్‌ చేస్తామని.. ఆ తర్వాత 13 వ రిలీజ్‌ చేస్తామని వరుసగా చిత్ర బృందం పోస్ట్‌ చేసింది. ఎట్టకేలకు ఆగస్ట్‌ 13న రిలీజ్ అయింది. అయితే.. ఇలా వాయిదా పడటానికి దిల్‌ రాజ్‌ కారణమని.. మీడియా, సోషల్‌ మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే.. ఈ వార్తలపై స్వయంగా దిల్‌ రాజ్‌ స్పందించాడు.

కార్తీకేయ-2 సక్సెస్ మీట్‌లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ… నాకు సినిమా అంటే ప్రాణం.. ఓ సినిమా హిట్ అయితే తొలుత సంతోషించేది నేనేనన్నారు. ఎవరూ ఎవరి సినిమాను తొక్కేయాలని చూడరు.. వాస్తవాలను తెలుసుకుని రాయండి.. తెలియకపోతే మూసుకుని కూర్చోండని వార్నింగ్‌ ఇచ్చారు దిల్ రాజు. వేరే సినిమాని తొక్కాలి అని ఇండస్ట్రీ లో వుండే మేము అసలు అనుకోము.. అది న్యూస్ రాసే వాళ్ళకి, వినేవాళ్ళకి, చూసే వాళ్ళకి ఉండాల్సిన మినిమం కామన్ సెన్స్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version