దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా సీబీఐ కేసులో అప్రూవర్ గా మారిన వ్యాపార వేత్త దినేష్ అరోరాను ఈడీ అదుపులోకి తీసుకుంది. అనంతరం ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు.ఈ నేపథ్యంలో దినేశ్ అరోరాను నాలుగు రోజుల ఈడీ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.
ఈ దినేష్ అరోరా జైలులో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాకు సన్నిహితుడు. ఈ మేరకు ఈ నెల 11 వరకు దినేష్ అరోరా ఈడీ కస్టడీలో ఉంటారు. మరోవైపు దినేష్ అప్రువర్‌గా మారారనే సంకేతాలు వచ్చిన.. దినేష్ విచారణకు సహకరించడం లేదని ఈడీ పేర్కొంది. ‘సౌత్ గ్రూప్’, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య అరోరా “కిక్‌బ్యాక్” గా పనిచేశారని ఈడీ తన ఛార్జిషీట్‌లలో ఆరోపించింది.