రాజకీయం…. ప్రజాసేవ రెండూ వేరు.కొంత మంది కేవలం రాజకీయాలే చేస్తారు మరికొంతమంది ప్రజాసేవకే ప్రాధాన్యమిస్తారు. కానీ ఆయన మాత్రం కొత్త అర్ధం చెప్పారు. రాజకీయాన్ని నాయకత్వాన్ని విడదీసి దేని నిర్వచనం దానికే అంటూ కొత్త అర్థం రాసారు.రాజకీయం వేరు.. నాయకత్వం వే కొత్త నిఘంటువు తయారు చేసి ఇంటింటికి పంచి పెట్టాడు.అప్పటివరకూ ఉన్న కాంగ్రెస్ నాయకుల ఎజెండా వేరు.ఢిల్లీ పెద్దలు ఇచ్చిన ఎజెండానే వారు అమలు చేసేవారు.
ఎన్నాళ్లిలా ? ఎన్నేల్లిలా అనుకుంటున్న నేపథ్యంలో గొప్ప సంకల్పాన్ని భుజాలకెత్తుకుని కల్మషం లేని నవ్వుతో ముందుకు సాగాడు ఆ సామాజిక శాస్ర్తవేత్త. అజెండాల కోసమే నాయకులు…వారి సౌలభ్యం కోసమే ప్రభుత్వాలు….అనే సంప్రదాయాన్ని పూర్తి మార్చిన ఉన్నత శిఖరం ఆయన.పార్టీ ఇచ్చిన పాత కాలపు ఎజెండా కాపీలను చించేసి..ప్రజల ఎజెండాను జెండాగా చేసి సమున్నతంగా ఎగరేసి ఇంటింటా కొలువైన మానవ రూపం యాడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి. తన అడుగులే నవ సమాజానికి నూతన ప్రస్థానంగా మార్చి వైఎస్సార్‌గా జనానికి పరిచయమైన ఆయన జీవితం ఓ చరిత్ర.అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ కాంగ్రెస్లో ఆయన వేసిన అడుగుల ముద్రలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.
అనారోగ్యం వస్తే వెయ్యి రూపాయలా? అని భయపడే రోజులవి.అలాంటి సమయంలో పేదింటి గుండె… ధైర్యంతో ఖరీదైన వైద్యం చేయించుకునేలా ఓ కార్డుకి రూపాన్నిచ్చిన వైద్యుడు ఆయన. ఏ ఆస్పత్రితో అయినా వైద్యం చేయించుకునేలా పేదలకు కొండంత భరసా ఇచ్చారు వైఎస్సార్. అలా ముందుకు సాగిన పెద్దాయన ఎన్నో వేల గుండెలకు ప్రాణం పోశారు. ఇప్పటికీ ఆ హృదయాలు వైఎస్ఆర్.. వైఎస్ఆర్ అనే కొట్టుకుంటున్నాయి.అంతేకాదు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌తో పేదల పిల్లల బతుకులు మార్చిన మహనీయుడు వైఎస్‌ఆర్.ఆ చదువులు మనవలన కాదు అన్నవాళ్ళే వైఎస్‌ఆర్ ఉండగా ఎంతటి చదువులైనా చదువుకోవచ్చు అనేలా పేదల ఆలోచనలు మార్చిన ఋషి.పేదింటి పిల్లలు కూడా పెద్ద చదవులు చదవాలన్న సముచిత లక్ష్యంతో ఆనాడు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని మొదలు పెట్టారు దివంగత వైయస్ఆర్.
ప్రాజెక్టులు కట్టడం కాదు వాటిని రైతులకు ఉపయోగపడేలా చేయడమే నిజమైన పాలకుడి లక్షణం. జలయజ్ఞం ద్వారా అలాంటి అపురూప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతం చేసిన భగీరథుడు దివంగత నేత. జలయజ్ఞం ఓ ప్రధాన బాధ్యత కావాలంటూ లక్షల ఎకరాలకు నీళ్ళు పారించి రాష్ట్రంలో సిరులు పండించారు.
అందర్నీ సమ భావనతో చూడడం యోగులకే చెల్లింది. రాజకీయ నాయకుడైన వైఎస్ఆర్ కూడా అంతటి విశాల భావనను అవరచుకున్నారు. పాదయాత్రతో పేదల కష్టాలు చూశాక ఆయనలో సమతావాది నిద్రలేచాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికి.. ప్రతి గుండెకు.. ప్రతి మమసుకు చేరువయ్యేలా పరిపాలించారు. అందుకే ఆయన ఇప్పుడు ప్రజల మధ్యలో లేకపోయినా వారి మనసుల్లో ఎప్పటికీ జీవించి ఉన్నారు.తనపట్ల అంతులేని ప్రేమ చూపిన ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వైఎస్ఆర్ కూడా అదే రీతిలో సంక్షేమ వరాలు కురిపించి కళ్ళముందే అంతర్థానమైపోయారు. వైయస్సార్ ఆశయాలు ఆలోచనలు కొనసాగిస్తూ రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ఇంటా సంతోషాలు నింపే బాధ్యత తీసుకున్నారు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన్ను ఇంటి పెద్ద కొడుకుగా ఏపీ ప్రజలు చూసుకుంటున్నారు. జగన్‌లో పెద్దాయనను చూసుకుంటూ మురిసిపోతున్నారు.