ఈ సరి సూసైడ్ గురించి క్లాస్ పీకిన పూరి..!

-

టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న డైరెక్టర్  పూరి జగన్నాథ్.ఆయన ఈ మధ్యకాలంలో  కొన్ని విషయాలపై తన అభిప్రాయాలను బయటపెడుతూ సూటిగా మాట్లాడుతున్నారు.   ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ తన వాయిస్ ఓవర్‌తో కొన్ని ఆడియోలను తీసి విడుదల చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఆయనకు నచ్చిన ఏదో ఒక టాపిక్ ఎంచుకుని దానిపై తనకున్న అభిప్రాయం ఏమిటో అనేది అందరికి అర్థమయ్యేలాగా చెబుతున్నారు.ఇప్పటికే చాలా రకాల టాపిక్‌ల మీద వాయిస్ మ్యూజింగ్స్ విడుదల చేసారు. అయితే ఇప్పుడు ఆయన ‘సూసైడ్‌(ఆత్మహత్య)’ అనే టాపిక్ ను ఎంచుకుని పూరి మ్యూజింగ్స్ లో ఆయన అభిప్రాయం వెల్లడించారు.

ఆత్మహత్య గురించి మాట్లాడుతూ “జీవితంలో ఎన్నోసార్లు మనమీద మనకే చిరాకు పుడుతుంది. ఛీ ఏమి జీవితం.. చచ్చిపోదామనిపిస్తుంది. ఇలాంటి ఆలోచన మనలో చాలా మందికి వచ్చుంటుంది.అయితే ఇలా సూసైడ్‌ ఆలోచన ఉన్నోళ్లంటే నాకు చాలా రెస్పెక్ట్‌. ఎందుకంటే ఈ ఆలోచన తెలివిగల వాళ్లకు మాత్రమే వస్తుంది. ఫూల్స్ ఎప్పుడూ అలా ఫీల్‌ కారు. అందరూ పిరికివాళ్లే ఆత్మహత్య చేసుకుంటారు అని అంటారు. కానీ అది తప్పు, నిజానికి చనిపోవడానికి ఎంతో ధైర్యముండాలి. అయిన చనిపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి.

ఫైనాన్సియల్‌ కావచ్చు, ఫ్యామిలీ సమస్యలు కావచ్చు. వీటన్నిటిని బాధ్యతగా తీసుకున్న వాళ్లు మాత్రమే ఇలాంటి మనస్తత్వానికి గురవుతారు. బాధ్యతారాహిత్యంగా ఉండేవాళ్లకి ఇలాంటి ఆలోచలు రావు.ఎందుకంటే వాళ్ళకి కుటుంబ బాధ్యతలు తెలియవు, డబ్బు సంపాదించాలన్న విషయాలు తెలియవు… తెలిసిందల్లా బాధ్యత లేకుండా తిరగడం.. ఎవరన్నా తెస్తే తినడం.. అంతేకాని వాళ్లకంటూ సమస్యలు ఏమి ఉండవు. అందుకే చావాల్సింది వాళ్లు.. నువ్వు కాదు..ఎందుకంటే నీకు బాధ్యతలు తెలుసు.. అందులోను నువ్వు చాలా తెలివి తేటలు ఉన్న వ్యక్తివి.. నీకు ప్రేమించే గుణముంది. నువ్వు తప్పు చేయవు. ఎవరైనా మాట అంటే తట్టుకోలేవు. నీకు ఆత్మాభిమానం కూడా ఎక్కువ. పైగా ఇంటెలిజెంట్‌. దానికి తోడు చనిపోవడానికి కావలిసిన దమ్ము నీలో ఉంది. ఇవన్నీ హీరో లక్షణాలు. నువ్వు హీరోవి.. నువ్వు చనిపోవడమేంటి..? అంటూ పూరీ సూసైడ్ గురించి తన “పూరి మ్యూజింగ్‌”లో ఆసక్తికర మాటలు చెప్పారు.. !!

 

Read more RELATED
Recommended to you

Exit mobile version