Parasuram: ‘సర్కారు వారి పాట’ హిట్ పక్కా..డైరెక్టర్ పరశురామ్ ధీమా

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు..నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’ . ఈ పిక్చర్ ఈ నెల 12న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ వారు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ అప్పుడే స్టార్ట్ చేశారు.

‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ..లో మహేశ్ బాబు ఇంకా యంగ్ గా కనిపిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు పరశురామ్, హీరోయిన్ కీర్తి సురేశ్..తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో ‘సర్కారు వారి పాట’ చిత్ర విశేషాలు పంచుకున్నారు. మహేశ్ బాబు క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో వెరీ డిఫరెంట్ గా ఉంటుందని, స్టోరిలో భాగంగా మహేశ్ యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోతాయని పరశురామ్ చెప్పుకొచ్చారు. ఈ పిక్చర్ స్టోరి చెప్పగానే మహేశ్ బాబు వెంటనే ఓకే చేశారని వివరించారు పరశురామ్.

‘సర్కారు వారి పాట’ మూవీలో మహేశ్ బాబు డ్యాన్సులు, ఫైట్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని తెలిపారు పరశురామ్. మహేశ్ బాబు యాటిట్యూడ్ సినిమాలో వెరీ డిఫరెంట్ గా ఉండబోతున్నదని స్పష్టం చేశారు పరశురామ్. కీర్తి సురేశ్ హీరోయిన్ గా ఈ సినిమాలో చక్కటి అభినయం కనబర్చినట్లు విడుదలైన ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version