KGF2 రికార్డ్స్ అన్‌స్టాపెబుల్..హిందీ చిత్ర సీమలో రాఖీ భాయ్ హవా

-

శాండల్ వుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన KGF2..గత నెల 14న విడుదలైంది. ఈ సినిమా ఇప్పటికీ రికార్డు వసూళ్లు చేస్తోంది. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.

రాఖీ భాయ్ హవా బాక్సాఫీసు వద్ద ఇంకా కొనసాగు..తోంది. బాలీవుడ్ మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్..KGF2 ఫిల్మ్ రికార్డుల గురించి తాజాగా ట్వీట్ చేశాడు. బాలీవుడ్ చిత్ర సీమలో రూ.400 కోట్ల వరకు ఈ ఫిల్మ్ జర్నీ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ గా KGF2 పిక్చర్ నిలిచిందని వివరించారు.

హిందీ చిత్ర సీమలో సెకండ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా KGF2 నిలిచింది. ఇక ఈ సినిమాకు అన్‌స్టాపెబుల్ రికార్డ్స్ వస్తున్నాయని చెప్పారు. ఈ ఫిల్మ్ సౌత్ ఇండియన్ సినిమా స్టామినాను దేశవ్యాప్తంగా నిరూపించింది.

సౌత్ ఇండియన్ ఫిల్మ్స్‌కు పాన్ ఇండియా వైడ్ రెస్పాన్సే కాదు..ప్రపంచవ్యాప్తంగా చక్కటి ఆదరణ లభిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా చాప్టర్ 1 ను మించిన విజయం సాధించడం పట్ల కన్నడ చిత్ర సీమ కు చెందిన ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టండన్ చాప్టర్ 2లో కీలక పాత్రలు పోషించారు. ఇక KGF2 రికార్డులను ఎవరూ ఆపలేరని ఈ సందర్భంగా మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version