డైరెక్ట‌ర్ తేజ‌కు నిరాశ‌.. ఆ విష‌యంలో వెన‌క్కుత‌గ్గినందుకే!

-

కొత్త క‌థ‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌లోని డైరెక్ట‌ర్‌ను మ‌రో కోణంలో చూపిస్తుంటారు ద‌ర్శ‌కుడు తేజ‌. ఈయ‌న సినిమాల‌న్నీ ఇప్ప‌టి వ‌ర‌కు సొంతంగానే తీశారు. ఒక్క‌టి కూడా సీక్వెల్ లేదు. ఆయ‌న సినిమాలు ఎంత‌లా ఆక‌ట్టుకుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. విల‌క్ష‌ణ‌మైన సినిమాలు తీయ‌డంలో ఆయ‌న దిట్ట‌. కానీ ఇప్పుడు ఆయ‌న‌కు ఓ నిరాశ ఎదురైంది.

చిత్రం సినిమాలాంటిది మ‌రోటి తీయాల‌ని ఆయ‌న ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. అందుకు త‌గ్గ‌ట్లే 1.1సినిమాను మొద‌లు పెట్టారు. కొత్త న‌టుల‌తో దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈసినిమాను వైవిధ్య‌మైన స‌న్నివేశాల‌తో నింపేయాల‌ని ఆయ‌న ప్లాన్ చేశారు.

కానీ ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ అంద‌రినీ వ‌ణికిస్తోంది. ఇప్ప‌టికే స‌ర్కారువారి పాట‌, ఆచార్య‌, నార‌ప్ప‌, ల‌వ్ స్టోరీ లాంటి సినిమాలు వాయిదా ప‌డ్డాయి. ఇక తేజ మూవీ కూడా షూటింగ్ చివ‌రి దశ‌కు వ‌చ్చింది. కానీ క‌రోనా క‌లవ‌రం పెట్ట‌డంతో మూవీని వాయిదా వేస్తున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ ఏడాదిలో దీన్ని విడుద చేయాల‌ని చూసినా.. అది కుదిరేలా క‌న‌ప‌డ‌ట్లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version