మరోసారి తెర మీదకు బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వివాదం

-

కడప జిల్లాలోని పోతులూరు వీరబ్రహ్మంగారి పీఠాధిపత్యం వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. కొద్ది రోజుల క్రితమే మఠం పీఠాధిపత్యం వివాదం కొలిక్కి వచ్చిందనుకుంటున్న సమయంలో దివంగత పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ పీఠాధిపతి విషయంపై హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది.

కాగా పీఠాధిపత్యం వివాదంలో పెద్ద మనుషులు బలవంతంగా తమను ఒప్పించి రాజీ కుదిర్చారని మహాలక్ష్మమ్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పీఠాధిపతి నియామకం అనేది వీలునామా ప్రకారమా.?లేదా కుటుంబ సభ్యుల ఒప్పందం ప్రకారమా? అనేది తేల్చాలని ఆమె హైకోర్టును కోరారు. వీలునామా ప్రకారం అయితే పీఠాధిపత్యం తన కుమారుడికే దక్కాలని కోరుకుంటున్నట్లు వివరించారు.ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని పిటిషన్‌ వేసినట్లు తెలిపారు.

బ్రహ్మంగారి మఠం 11వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మరణం తర్వాత పీఠాధిపత్యం వివాదం మొదలయింది. ఆయనకు ఇద్దరు భార్యలు కాగా… మొదటి భార్యకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు, రెండో భార్యకు మైనర్లు అయిన ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మఠం పీఠాధిపత్యం కోసం ఇద్దరు భార్యల కుమారులు పోటీపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version