మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా రేపు (శుక్రవారం) నిర్వహించాల్సిన మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ వాయిదా వేసింది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో అసెంబ్లీ వెనుక ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించ తలపెట్టారు.

బుధవారం కురిసిన భారీ వర్షానికి ప్రాంగణం కార్యక్రమానికి అనుకూలంగా లేకపోవడంతో వాయిదా నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా.. మెగా డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ను ప్రభుత్వం రెండు రోజుల కిందటే విడుదల చేసింది. https://apdsc.apcfss.in/ లో జాబితాను చెక్ చేసు కో వచ్చు. డీఎస్సీ సెలక్షన్ లిస్ట్ ను మంత్రి నారా లోకేష్ రిలీజ్ చేశారు. తాము ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటామని నారా లోకేష్ పేర్కొన్నారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి అయినట్లుగా పేర్కొన్నారు.