హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై డీకే అరుణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతీ రౌండ్ లో బీజేపీ ముందుందని.. తెలంగాణ లో టీఆర్‌ఎస్ కి పతనం ప్రారంభమైందని హెచ్చరించారు. హుజూరాబాద్ నుండే పతనం కి నాందని… కెసిఆర్ అహంకారం..అణచివేత కు ఫలితం ఇదేనని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో గెలవడానికి చేసిన మోసం దళిత బందు తీసుకువచ్చారని… దళిత బందు ప్రవేశ పెట్టిన ఊర్లో కూడా బీజేపీ కె ఎక్కువ ఓట్లు వచ్చాయని చురకలు అంటించారు.
కెసిఆర్ ప్రభుత్వం ప్రజల నమ్మకం పోగొట్టకున్నదని… భారీ మెజారిటీ తో ఈటెల గెలుస్తారని స్పష్టం చేశారు డీకే అరుణ. హుజూరాబాద్ ఉప ఎన్నికల మేమే గెలుస్తాం అని మొదటి నుండి చెప్పామని… హుజూరాబాద్ ప్రజల తీర్పుకు శిరసు వంచి కృతజ్ఞతలు తెలిపారు డీకే అరుణ. కెసిఆర్ అహంకారం కి హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఓ గుణపాఠమని… హుజూరాబాద్ లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు. ఈటెల..కెసిఆర్ మధ్యనే పోటీ అన్నట్టు ఎన్నిక జరిగిందని… వచ్చే ఎన్నికల నాటికి గ్రామ గ్రామానికి పార్టీ విస్తరిస్తుందన్నారు. ఇకనైనా కెసిఆర్..తన ఓటమిని అంగీకరిస్తారా..? లేదా ? అని నిలదీశారు. తెలంగాణ ప్రజలు..కెసిఆర్ ను తరిమి కొట్టడానికి సిద్దం అయ్యారని రుజువైందని తెలిపారు.