గుక్కపెట్టి ఏడ్చే సమయంలో చిన్నారుల శరీరం నీలం రంగులోకి మారుతుందా? కారణమేంటంటే..!

-

పిల్లల్ని పెంచటం అంటే పెద్ద టాస్క్ హే అని చెప్పాలి. ఎందుకు ఏడుస్తారో తెలియదు. ఎందుకు నవ్వుతారో తెలియదు. ఉన్నట్టుండి వారి మూడ్ మారిపోతూ ఉంటుంది. చిన్నారులకు కొంత వయసువచ్చేవరకూ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే చిన్నారులు ఏడ్చే సమయంలో వారిలో కనిపించే మార్పులు ప్రతితల్లిని ఆందోళనకు గురిచేస్తాయి. కొంత మంది చిన్నారులు గుక్కపెట్టి ఏడిచే సమయంలో శరీరం నీలం రంగులోకి మారుతుంది. దీనినే బ్రీత్‌ హోల్డింగ్‌ స్పెల్స్‌ అంటారు. అయితే ఈ సమస్య ఎందుకు వస్తుంది.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు చూద్దాం.

బ్రీత్‌ హోల్డింగ్‌ స్పెల్స్‌, లక్షణాలు ఎలా ఉంటాయంటే?

ఈ బ్రీత్‌ హోల్డింగ్ స్పెల్స్‌ సమస్య 6 నెలల నుంచి 5 ఏళ్ల మధ్య చిన్నారుల్లోనే కనిపిస్తుంటుంది. సాధరణంగా చిన్నారుల వారి చేతుల్లో వస్తువులను ఉన్నట్లుండి లాక్కోవడం లేదా వారు చేస్తోన్న పనిని అడ్డుకోవడం వల్ల ఏడుపు మొదలు పెడతారు. ఇలా క్రమేణా పెరిగే ఏడుపు వారి శ్వాస ప్రక్రియ ఆగిపోయేంత వరకు దారి తీస్తుంది. దీనివల్లే ముఖం నీలి రంగులోకి మారిపోతుంది. దీనిని మెడికల్‌ పరిభాషలో ‘సైనోసిస్‌’ అంటారు. పెదవులతో పాటు ముఖం అంతా నీలి రంగులోకి మారుపోతుంది. అయితే కాసేపటికే సాధారణ స్థితికి వచ్చేస్తారు.

వీళ్లలోనే ఇలా ఉంటుందట

బ్రీత్‌ హోల్డింగ్‌ స్పెల్స్‌ సమస్య మొండిపట్టుతో ఏడిచే పిల్లల్లోనే కనిపిస్తుంది. అయితే చిన్నారులు ఇలా ఊపిరి ఆపివేసేలా ఏడవడానికి పలు కారణాలు ఉంటాయి. విపరీతమైన నొప్పి లేదా వారు చేస్తోన్న పనిని ఉన్నపలంగా అడ్డుకోవడం, తన మాట వినడం లేదనే మొండి తనంతో ఏడుపు మొదలై గుక్కపెట్టి మరీ ఏడ్చేస్థాయికి చేరుతుంది.

ఈ సమయంలోనే ఊపిరి అందక అసాధారణంగా ప్రవర్తిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో చిన్నారులు చేతులు వంకర్లు పోవడం, కళ్లు తేలేయడం వంటివి కూడా అవుుతంది. ఇవి దాదాపు ఫిట్స్‌తో సమానమైన లక్షణాలే. అయితే ఏడిచిన ప్రతీసారి ఇలానే జరుగుతుందా అంటే..కాదు, నిమిషానికి మించి ఏడిస్తే మాత్రం ఎక్కువ శరీరం రంగు మారే అవకాశాలు ఉంటాయట. ఇక ఫిట్స్‌కి గుక్కపట్టి ఏడవడానికి చాలా తేడా ఉంటుంది. ప్రతీ ఐదుగురు చిన్నారుల్లో ఒకరు బ్రీత్‌ హోల్డింగ్‌ స్పెల్స్‌ సమస్యతో బాధపడతారని నిపుణల అంచనా.

సమస్యకు పరిష్కారమేంటి?

బ్రీత్‌ హోల్డింగ్‌ స్పెల్స్‌ సమస్యకు ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏం లేదు. సాధారణంగా ఈ సమస్య చిన్నారులు పెరిగే కొద్దీ తగ్గిపోతుుంటుంది. ఎవరికైతే ఐరన్‌, హిమో గ్లోబిన్‌ లోపం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ లోపాలకు చెక్‌ పెట్టడానికి మెడిసిన్‌ ఇవ్వడం లేదా చిన్నారుల ఆహారంలో ఆకుకూరలు, చక్కెర బదులు బెల్లం ఇవ్వడంతో ఐరన్‌ను అందిస్తే సమస్యను అధిగమించవచ్చు. చిన్నవయసులోనే మెడిసిన్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి కాబట్టి ఆహారంలో మార్పులు చేయడమే మంచి పరిష్కారం.

పేరంట్స్ కూడా చిన్నారులను అతిగారాబం చేయంట సమస్యే..పదిసార్లు అడిగినది ఇచ్చే పదకొండే సారి ససేమిరా నో అంటే..చిన్నారులు తట్టుకోలేరు..బాగా ఏడ్చేస్తారు. కాబట్టి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగానే వారని కావల్సినవి ఇవ్వాలి. అదేపనిగా గుక్కపెట్టి ఏడుస్తుంటే అజాగ్రత్తగా అస్సలు ఉండకూడదు. వారి ఏడుపుని మాన్పించే ప్రయత్నం చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version