గాడ్సేను ప్రేమించేవారు బాపూఘాట్ అభివృద్ధి చేస్తారా? : మంత్రి పొన్నం

-

గాడ్సేను ప్రేమించే వారు బాపూఘాట్‌ను అభివృద్ధి చేయలేరని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మూసీ ప్రక్షాళణ పేరుతో నిరుపేదల ఇళ్లను కూల్చితే ఊరుకునేది లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఘాటుగా స్పందించారు. మూసీ పునరుజ్జీవంపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎవరినీ బలవంతంగా ఇళ్ల నుంచి తరలించేది లేదని క్లారిటీ ఇచ్చారు.

ప్రజలను ఒప్పించాకే మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం చుడతామన్నారు. ఇప్పటివరకు కేవలం సర్వే మాత్రమే కొనసాగిందన్నారు. PPP మోడ్‌లో మూసీ పునరుజ్జీవం చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌కు కిషన్‌రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. గాడ్సేను ప్రేమించే బీజేపీ నేతలు బాబూ ఘాట్‌ను అభివృద్ధి చేయరని చురకలంటించారు.బస్తీ నిద్రలు చేశాకైనా బీజేపీ నేతలు ప్రజల ముందు వాస్తవాలు చెప్పాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version