వాస్తు: ఇంట్లో శివుడి ఫోటోలని పెట్టేటప్పుడు ఈ తప్పులు చెయ్యకండి..!

-

వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఇబ్బంది లేకుండా అందంగా ఉండడానికి అవుతుంది.అయితే ఈ రోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు. వీటిని కనుక ఫాలో అయితే కచ్చితంగా ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. చాలా మంది ఇంట్లో దేవుడు ఫోటోలను పెట్టుకుంటూ ఉంటారు.

అయితే దేవుడు ఫోటోలు పెట్టుకోవడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే శివ పురాణం ప్రకారం శివుడి ఫోటో ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. అయితే శివుడు ఫోటోలని పెట్టుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

శివుడు ఫోటోలు ఎప్పుడూ కూడా మీకు నచ్చిన దిక్కున పెట్టకూడదు. తప్పు దిక్కులో పెట్టడం వల్ల సమస్యలు వస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం శివుడు ఫోటో ని ఇంట్లో ఉంచితే మంచిది. ఉత్తరం వైపు శివుడు ఫోటోని పెట్టుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుంది ఇంక ఏ దిక్కులో పెట్టుకోవడం మంచిది కాదు.

అలానే ప్రతి రోజు కూడా శివుడికి పూజించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలానే బంధం బలపడుతుంది. శివుడు ఫోటోలు ఇంట్లో పెట్టుకునేటప్పుడు నందితో పాటు కలిపి ఉన్నది పెట్టుకుంటే మరింత మంచిది. అదేవిధంగా ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలానే దేవుడు ఫోటోలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా ఈ విధంగా మార్పులు చేస్తే ఎంతో మంచి కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version