ఈరోజు పితృపక్షం నాల్గవ రోజు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సమయంలో చనిపోయిన పూర్వీకులకి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది. 16 రోజుల పాటు ఉన్న ఈ పితృపక్షం సమయంలో మంచి పనులు చేయడం వలన చాలా మంచి జరుగుతుంది. పైగా చనిపోయిన పూర్వికులు ఆశీస్సులు లభిస్తాయి. ఈరోజు భగవంతుడిని ఆరాధించడం పూర్వికుల్ని తలచుకొని ఎవరికైనా దానధర్మాలు చేయడం వంటి మంచి పనులు చేస్తే ప్రశాంతత కలుగుతుంది. కుటుంబానికి రక్షణ కూడా కలుగుతుంది.
శ్రార్థానికి సమయం 12:39 నుంచి 9:15 వరకు అనుకూలంగా ఉందని పండితులు చెప్తున్నారు. ఈరోజు ఎలాంటి పద్ధతుల్ని పాటిస్తే మంచి జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.. తేనే, తులసి, గంగాజలం, పచ్చిపాలు, బార్లీ చనిపోయిన పూర్వీకులకి అందించడం చాలా మంచిది. నెయ్యితో దీపాన్ని వెలిగించి అగర్బత్తిని వెలిగించడం వలన పూర్వీకులు మన ఇంటికి వస్తారు.
చనిపోయిన వారి పేర్లు చెప్పి మంత్రాలు చదవడం వలన పూర్వికులు ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబమంతా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంట్లో వాతావరణం కూడా చాలా పాజిటివ్ గా ప్రశాంతంగా ఉంటుంది. బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి భోజనం పెడితే కూడా ఎంతో మంచి జరుగుతుంది. ఈ పదిహేను రోజులు ఉల్లి వెల్లుల్లిలో తీసుకోకూడదు. ఇవి ఒంట్లో వేడిని ఎక్కువ కలిగిస్తాయి. అలాగే మద్యం సేవించకూడదు. మద్యం తీసుకుంటే చెడు ప్రభావం వారి పై పడుతుందట. శ్రార్థం పెట్టే వాళ్ళు పచ్చిపప్పులు, గోధుమలు ముట్టుకోకూడదు.