భార్యాభర్తల మధ్య గొడవలు వుండకూడదంటే ఇలా చెయ్యండి..!

-

చాలా మంది భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇబ్బంది వారికి కలుగుతూనే ఉంటుంది. అయితే నిజానికి భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఇద్దరి మధ్య అర్థం చేసుకునే గుణం ఉండాలి. ఒకరి ఎమోషన్స్ ని ఒకరు అర్థం చేసుకోవడం.. ఒకరిని మరొకరు ఖుష్ చేయడం వంటివి చాలా అవసరం.

భార్య భర్త ఇద్దరూ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉండాలి. అయితే వైవాహిక జీవితంలో సమస్యలు రావడం సహజం. ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే భార్య భర్తలు కచ్చితంగా కొన్ని విషయాలని పాటించాలి. అయితే మరి భార్య భర్తలు ఎలా అందంగా ఉండగలరు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

గొడవలు వచ్చినప్పుడు కాసేపు విరామం తీసుకోండి:

ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రమాదం ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా ఆవేశంతో కాదు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరుగుతుంటే కాస్త విరామం ఇచ్చేయండి. ఆ తర్వాత తిరిగి మాట్లాడండి.

ఒకరికి ఇష్టం లేనిదే చేయకండి:

మీ భార్య కి కానీ భర్త కి కానీ ఏదైనా ఇష్టం లేదు అంటే దానిని అసలు చేయొద్దు ఒకరి ఇష్టాయిష్టాలను తెలుసుకుని వాళ్ళ ఇష్టాయిష్టాలను గౌరవించండి అప్పుడు కచ్చితంగా వైవాహిక జీవితంలో ఆనందంగా ఉండడానికి అవుతుంది.

కాసేపు మాట్లాడి చూడండి:

గొడవ అయింది కదా నేను ఎందుకు మాట్లాడాలి నేను ఎందుకు మాట్లాడాలి అని అహంకారానికి పోవద్దు. పంతం వద్దు. చక్కగా సమస్యలను పరిష్కరించుకోండి. కాస్త సమయం తీసుకుని మాట్లాడండి ఇలా మాట్లాడటం వల్ల పోయేదేముంది మీ ప్రేమను తిరిగి పొందుతారు దాని కంటే ఇంకేం అవసరం.

ఏ మాత్రము నిర్లక్ష్యం చేయకండి:

అదే సర్దుబాటు అవుతుందిలే నేనేం చేయాలి అని నిర్లక్ష్యం చేయకండి వెంటనే సమస్యలను పరిష్కరించుకోండి. వీలైనంత వరకు వెళ్లి మాట్లాడేసి సర్దుకోండి ఇలా భార్య భర్తలు గొడవలు పడుతున్నప్పుడు ఈ విధంగా ఫాలో అయితే ఏ బాధ ఉండదు. అంతే కానీ ప్రతి చిన్నదానిని సాగదీసుకుంటూ పోతే భార్యాభర్తల మధ్య బంధం చెదిరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version