ఈ రోజుల్లో అన్నం వండేందుకు కుక్కర్ వాడని గృహిణీ అంటూ లేదమో కదా..రెండు కప్పులు రైస్ తీసుకోవండ కడిగి కుక్కర్లో వేయటం.. గ్యాస్ మీద ఏదో ఒక కర్రీ చేయడం..అంతే వంట అయిపోతుంది. వంటగదిలో ఎలక్ట్రిక్ సామన్లదే హవా. అయితే కరెంట్ కుక్కర్లో వండిన అఎన్న ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకు కారణం ఏంటి, తినటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం..ఈరోజుల్లో మనకు తెలియకుండానే ఎన్నో రోగాలు మనల్ని చుట్టుముడుతున్నాయి..వాటికి కారణం..మనం చేసే చిన్న చిన్న తప్పులే.
ఇక అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయంటేన..
కీళ్ల వాతం
మధుమేహం
గ్యాస్ సమస్యలు
అధిక బరువు
నడుము నొప్పి
ఉదర సంబంద సమస్యలు
గుండె సంబందిత సమస్యలు
కాబట్టి డైలీ కుక్కర్లోనే రైస్ చేసే వాళ్లు ఓ సారి ఆలోచించండి.. ప్రత్యామ్యాయం ఆలోచించండి. టైం లేనప్పుడు అంటే సరే చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న సమయాల్లో కూడా కుక్కర్లోనే రైస్ పెట్టేసి చేతులు దులుపుకోకుండా..గ్యాస్ పైన వండేందుకు ప్రయత్నించండి. ఇప్పుడు కుక్కర్ వాడకం ఎంతలా పెరిగిందంటే..మనకు గ్యాస్ మీద వండిన అన్నం కూడా తినాలనిపించదు. కుక్కర్లో ఉన్నంత సాఫ్ట్గా రైస్ రాదు.. గ్యాస్ పై వండిన అన్నం లావుగా వస్తుందని చాలా మంది తినటానికి ఇష్టపడటం లేదు కూడా. వారానికి రెండు మూడు రోజులు కుక్కర్లో చేసుకున్నా..మిగిలిన రోజుల్లో ప్రత్యామ్మాయాన్ని ఎంచుకోమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.