ఈ బ్యాంక్‌లో మీకు ఖాతా ఉందా..? అయితే కొత్త రూల్స్ వస్తున్నాయి తెలుసుకోండి…!

-

బ్యాంక్ ఖాతాదారుల్లకి ఎలర్ట్. దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ వంటి వాటిల్లో ఖాతా ఉన్నట్టయితే తప్పకుండ ఈ విషయాలని తెలుసుకోండి. మార్చి 1 నుంచి కొత్త రూల్స్ వస్తున్నాయి. వీటి గురించి తప్పక తెలుసుకోండి. ఇక వీటి కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. బ్యాంకుల విలీనం కారణంగా పలు అంశాల్లో మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. అయితే మారుతున్న వాటిని కస్టమర్లు కూడా గుర్తించుకోవాలి.

అలానే బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ కస్టమర్లు ప్రత్యేకించి ఈ విషయాలు తెలుసుకోవాలి. దేశీ అతి పెద్ద మూడో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు మార్చి 1 తర్వాత మారనున్నాయి. తాజాగా ఈ విషయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలియజేసింది. అలానే దేనా బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు కూడా మారుతున్నట్టు తెలుస్తోంది. దీనితో కస్టమర్ల పై ప్రభావం పడనుంది. విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ మారుతున్నాయని అవి మార్చి 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమలు లోకి వస్తాయని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది.

అయితే కస్టమర్లు కొత్త కోడ్స్ ని తెలుసుకోవాలి. 1800 258 1700 నెంబర్‌కు కాల్ చేసి కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్‌ తెలుసుకో వచ్చు. లేదంటే బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి వివరాలు పొందొచ్చు. ఈ పధ్ధతి కాక పోతే 8422009988 నెంబర్‌కు MIGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్ చివరి 4 అంకెలు ఎంటర్ చేసి ఎస్ఎంఎస్ పంపిన తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version