ఓవెన్ లో పెట్టిన ఆహారం తీసుకుంటే ఇబ్బందులు వస్తాయా..?

-

ప్రస్తుతం చాలామంది ఇళ్లల్లో ఉపయోగించే వస్తువుల్లో మైక్రోవేవ్ కూడా సాధారణంగా మారింది. సమయాన్ని ఆదా చేసుకోవడానికి అందరు వాడుతున్నారు. కానీ ఆరోగ్యానికి సంబంధించి ఆలోచించరు. మైక్రోవేవ్ ద్వారా కొంతమంది వంటలు తయారు చేసుకుంటే కొంతమంది ఆహార పదార్థాన్ని వేడి చేసుకుని తినడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే దీన్ని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి మంచిదేనా..? మీ దృష్టిలో ఆరోగ్యానికి హానికరమా లేదా ఉపయోగమా..? మరి వీటి కోసం ఇప్పుడే చూద్దాం.

 

మైక్రోవేవ్ వల్ల కలిగే ఉపయోగాలు :

వంటగదిలో ఉపయోగించే వస్తువులలో మైక్రోవేవ్ ఒక మంచి ఉపయోగకరమైన వస్తువు. మైక్రోవేవ్ ద్వారా ఆహార పదార్థాలు వండుకోవడం మరియు వేడి చేసుకోవడం ఎంతో తక్కువ సమయంలో జరుగుతుంది. ఈ విధమైన ఉపయోగాలు ఉంటే కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. మైక్రోవేవ్ లో ఎలక్ట్రిక్ మరియు మేగ్నటిక్ వేవ్స్ ఎనర్జీ రూపంలో ఉత్పత్తి అవుతుంది. దాని వల్ల ఆహార పదార్థానికి రేడియేషన్ కలుగుతుంది. ఇదే మీకు హానికరం.

ఆయుర్వేదం ఏం చెబుతోంది..?

ప్లాస్టిక్ వస్తువుల్ని ఉపయోగించి ఆహార పదార్థాల్ని చాలా మంది వేడి చేస్తూ ఉంటారు, ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ లో ఉండేటువంటి అధిక శాతం బిస్ఫినాల్ ఏ అనే హానికరమైన పదార్థం ఉత్పత్తి అవుతుంది. దాని వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అంతేకాదు మైక్రోవేవ్ ఆహార పదార్థాల్లో ఉండే న్యూట్రియంట్స్ ను తగ్గించేస్తుంది.

మైక్రోవేవ్లో తయారుచేసిన ఆహారం తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి మైక్రోవేవ్ కు బదులుగా కొత్త మార్గాలను ప్రయత్నించి మీ సమయాన్ని ఆదా చేసుకోండి. మైక్రోవేవ్ కి బదులుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేసి దాని పైన ఒక ప్లేట్ లో ఆహార పదార్థాలను వేడి చేసుకోండి. ఇది కూడా సమయాన్ని ఆదా చేస్తుంది ఆరోగ్యానికి ఎటువంటి హానికూడా కలదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version