నీ జీవితం పట్ల సరైన దృక్పథాన్ని కలిగి ఉన్నావా? ఒక్కసారి చెక్ చేసుకో..

-

జీవితంలో ముందుకు సాగాలంటే నీ జీవితం పట్ల నీఖు సరైన దృక్పథం ఉండాలి. అలా లేనపుడు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగలేవు. ఈ ప్రపంచంలోకి నువ్వొక్కడివే వచ్చావు. నువ్వెలా ఉండాలన్నది నువ్వే నిర్ణయించుకోవాలి. నువ్వెలా ఉన్నా హ్యాప్పీగా ఉండగలగాలి. అలా ఉండకుండా నిన్ను నువ్వు తిట్టుకుంటూ, ప్రతీదానికి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకుంటూ ఉంటే జీవితంలో అడుగు కూడా ముందుకు వేయలేవు. గతంలో చేసిన తప్పులని వదిలిపెట్టు. ప్రస్తుతం ఏంటనేదే ఆలోచించు.

ఇక్కడ ఎవరూ పర్ఫెక్ట్ కాదు. అందరికీ వారి వారి బలహీనతలు ఉంటాయి. మరి నువ్వెందుకు బాధపడాలి. తప్పు చిన్నదైనా పెద్దదైనా బాధపడుతూ కూర్చుంటూ ఉంటే ఎప్పుడు పైకి వస్తావు. నీ లోపాల మీద దృష్టి పెట్టి వాటినే తలచుకుంటూ ఉంటే ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఉండదు. అలా తలచుకోవడంలోనే జీవితం అయిపోతుంది. నువ్వెవరికీ నచ్చకపోయినా వదిలెయ్. ముందు నువ్వు నీకు నచ్చాలి. నువ్వెలాంటి పని చేసినా నీకంటూ ఉన్నది నువ్వే.

నువ్వు నీకు నచ్చాలి. అప్పుడే వేరే వాళ్ళకి నువ్వు నచ్చుతావు. అందుకే అన్నింటికీ బాధపడవద్దు. దేనికి బాధపడాలో దేనికి బాధపడకూడదో తెలుసుకోవాలి. నువ్విలా ఉండిపోవడానికి కారణం నువ్వే కావచ్చు. అలా అని నిన్ను నువ్వు కించపర్చుకుంటే బాగోదు కదా. జీవితంలో ఏది చేసినా నీకే కాబట్టి, ఫెయిల్యూర్ ని కూడా ఆనందించు. కొంతమంది ఫెయిల్యూర్లలో కూడా వారి పార్ట్ ఉండదు. కానీ నీ ఫెయిల్యూర్ కి వందశాతం నువ్వే కారణం.

నీ ఆనంద విషాదాలకి నువ్వే కారణమవడం కన్నా గొప్ప ఇంకేదీ ఉండదు. గెలవాలంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. అప్పుడే ఎన్ని అడ్డంకులు వచ్చినా జీవితమనే ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గమ్యాన్ని చేరుకోగలవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version