సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కి ప్రియాంకా ఎంత తీసుకుంటుందో తెలుసా…?

-

బాలీవుడ్ లో బిజీ గా హాలీవుడ్ లో బిజీ గా… పాపం ప్రత్యేక విమానాలు పెట్టుకుని అమెరికా, ముంబై తిరుగుతుంది ప్రియాంకా చోప్రా. హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ భామ. అక్కడ ఇప్పుడు మూడు నాలుగు సినిమాల్లో నటిస్తుంది ప్రియాంకా చోప్రా. ప్రియాంక ప్రస్తుతం ‘వి కెన్‌ బి హీరోస్‌’, ‘ది మాట్రిక్స్‌ 4’, ‘ది వైట్‌ టైగర్‌’ వంటి సినిమాల్లో నటిస్తోంది. ‘ది వైట్‌ టైగర్‌’ను నెట్‌ప్లెక్స్ సంస్ధ నిర్మిస్తోంది.

హిందీ సినిమా ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ ఇటీవల విడుదలై పెద్దగా ఫ్లాప్ అయింది. ఇది పక్కన పెడితే ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది అనే విషయం అందరికి తెలిసిందే. ప్రియాంకను ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు. అక్కడ ఆమె బ్రాండ్ ప్రమోట్ చెయ్యాలి అంటే ఆమె రూ.2 కోట్లు తీసుకుంటారని హోపర్‌ హెచ్‌క్యూ అనే సంస్థ తాజాగా వెల్లడించింది.

సోషల్ మీడియాలో ప్రియాంక ఏ రేంజ్ లో పాపులర్ అనేది అందరికి తెలిసిన విషయమే. ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీనితో ఆమెకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది అనే మాట నిజం. ప్రియాంకా చోప్రా కాస్త ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటుంది. దీనితో ఆమెకు ఫాలోయింగ్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆ ఫాలోయింగ్ ని ప్రియాంక ఈ విధంగా వాడుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version