రివర్స్ అనే పదం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా వినబడుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖలలో ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూసుకుంటుంటే, మరోపక్క ఇదే రివర్స్ విధానాన్ని చంద్రబాబు మరోలా ఫాలో అవుతున్నారు. మేటర్ లోకి వెళ్తే బీసీల రిజర్వేషన్ అంశంలో చంద్రబాబు ఈ విధానాన్ని అడ్డుకున్నట్లు ప్రస్తుతం వార్తలు వినబడుతున్నాయి. జగన్ ప్రభుత్వం మొదట బిసిలకు 54 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో చంద్రబాబు తన మనిషితో హైకోర్టులో అడ్డుకోవటం కేసు వేయడం మనకందరికీ తెలిసిన విషయమే.
మామూలుగా ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు ఎప్పుడో ఇలాంటి సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకొని రెడీగా ఉంటారు. కానీ అనూహ్యంగా ఎన్నికల ముందు చంద్రబాబు ఈ విధంగా రివర్స్ పంచులు వెయ్యడం చూస్తుంటే రివర్స్ రివర్స్ అంటూ డీప్ గా చంద్రబాబు కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఓటమి భయంతోనే చంద్రబాబు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మరో పక్క ఆయన తీరుపై వైసిపి నాయకులు విమర్శలు చేస్తున్నారు.