వారం ఎలా నిర్ణయిస్తారో తెలుసా..!

-

పంచాంగంలోని ఐదు అంగాలలో తిథి అంటే తెలుసుకున్నాం. వారం అంటే ఏమిటో తెలుసుకుందాం..

హోర ఆధారంగా ఆయా వారాలు ఆయా పేర్లతో పిలవబడుతున్నాయి. ఈ హోరలు ఆకాశంలో గ్రహాలు ఉండే క్రమాన్ని బట్టి ఉంటాయి. ఒక నియమితమైన వరుస క్రమం ప్రకారం ఈ హోరాక్రమం కదులుతుంది. ఈ క్రమంలో ప్రతిరోజు సూర్యోదయ కాలంలో ఏ హోర ఉంటుందో ఆ హోరను అనుసరించి ఆ వారం పేరు నిర్ణయించబడింది.

రోజులో ఒక్కో గంటకు ఒక్కో హోర ఉంటుంది. మనకు మొదటి రోజైన ఆదివారం సూర్యభగవానుని హోరతో ప్రారంభమవుతుంది. ఈ విధంగా రవి, శుక్ర, బుధ, చంద్ర, శని, గురు, కుజ హోరలు ప్రతి గంటకూ ఒక్కొక్కటి చొప్పున నియమిత క్రమంలో మూడు ఆకృతులలో ఒక రోజును పూర్తిచేసేందుకు 21 గంటలు పడుతుంది. తర్వాత 22వ గంట మళ్లీ రవిహోర, 23వ గంట శుక్రహోర, 24వ గంట బుధహోరతో ఆ రోజు పూర్తవుతుంది. ఇక మరుసటి రోజు 25వ గంట చంద్రహోరలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది. ఇదే విధంగా తక్కిన వారాలు వస్తాయి.

శుభకార్యాలకు మంచి వారాలు: సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలు శుభకార్యాలు ప్రారంభించేందుకు మంచివి.

ఆది, మంగళ, శనివారాలు అంతగా శుభఫలితాలు ఇవ్వవని చెప్పబడుతుంది.

తప్పనిసరి, ఆయా ముహూర్తాలు, శుద్ధి చక్రాలను అనుసరించి ముహూర్తాలు, శుభకార్యాలు పెట్టుకోవచ్చు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version