ఆ మాజీ రెవెన్యూ అధికారి సంపాదన ఎంతో తెలుసా?

-


ఏపీ విభజన తరువాత విజయవాడ ప్రాంతంలో పనిచేసిన ఒక ఎమ్మార్వో సంపాదన గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కుతుందని ఈ ప్రాంత రైతులు బాహాటంగా చెప్పుకుంటున్నారు. సీఆర్డిఏ పరిధిలో ప్రభుత్వం చేసిన భూ సమీకరణలో తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేసిన ఆ రెవెన్యూ అధికారి వందల కోట్లు వెనుకేసుకున్నారని, చిన్న, సన్నకారు, దళిత రైతుల జేబులు కొట్టి ప్రభుత్వ పెద్దలు, తిమింగళాలకు ఎరవేసి… వందల కోట్లు వెనుకేసుకున్నారని చెబుతున్నారు. ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు, ఏకంగా సీఎంస్థాయి వ్యక్తి వద్దకు కూడా ఆ మాజీ ఎమ్మార్వో ఎలాంటి ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా వెళ్లగలిగేవారని చెబుతున్నారు. అసైన్డ్, ఇనాం భూముల రికార్డుల తారుమారులో వందల కోట్ల స్కాం జరిగిందని, ఈ స్కాంలో ఆ మాజీ ఎమ్మార్వో వందల కోట్లు కూడపెట్టారని అంటున్నారు. తనకు సర్వీసు ఇంకా ఉండగానే నోట్లు లెక్కబెట్టుకోవాలనే ఆశ, ఆశయంతో వీఆర్ ఎస్ తీసుకున్న ఆ మాజీ రెవెన్యూ అధికారిని ప్రభుత్వంలోని పెద్దలు వారికి చేసిన సహాయానికి ప్రతి సహాయంగా మరో ప్రభుత్వ కార్పొరేషన్ లో మంచి పదవి, జీతం ఇచ్చి సేవలు కొనసాగిస్తున్నారని రైతులు లబోదిబోమంటున్నారు. తక్కువలో తక్కువ ఆ మాజీ ఎమ్మార్వో 500 కోట్లు వెనుకేసుకున్నారని, వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అయితే అతనిపైనే ఏసీబీ దాడులు జరుగుతాయని గ్రహించే సర్వీసు ఉన్నా వీఆర్ ఎస్ తీసుకున్నట్లు ఈప్రాంతరైతులు చెబుతున్నారు. అవున్లే ఆవు చేన్లో మేస్తే…దూడ గట్టున మేస్తుందా?

Read more RELATED
Recommended to you

Exit mobile version