పురాతన కాలం నుండి ఉపయోగించే ఈ ఆముదం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో. మరి నిజంగా ఆముదం వల్ల ఎటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుందో చూద్దాం. ఆముదంలో తెలుపు, ఎరుపు, పెద్దాముదం అనే మూడు జాతులుంటాయి. ఈ చెట్టు ఆకులు పైకి ఎత్తుకునే ఉంటాయి. వాతరోగాలనూ పోగొట్టడంలో ఆముదం ప్రధాన పాత్ర పోషిస్తుంది. విష జ్వరాలు, గుండె జబ్బులు, కుష్ఠు, దురద, వాపు, నులిపురుగులు, మలమూత్ర సంబంధ సమస్యలను సైతం ఆముదం నయం చేస్తుంది. మూత్ర పిండాల పని తీరును కూడా ఆముదం మెరుగు పరుస్తుందట. అలానే ఆముదం బోదకాలు సమస్యను కూడా నివారిస్తుంది.
దగ్గు నుండి ఉపశమనం కలగాలంటే ఆముదం లో తాలింపు వేసిన చామ దుంపల కూర తింటే దగ్గు తగ్గిపోతుంది. ఆముదం గింజలు, శొంఠి కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి.. రెండు నెలలు పాటు రెండు పూటలా ఒక్కొక్కటి చొప్పున తీసుకుంటే శరీరం పై నల్లటి మచ్చలు తగ్గిపోతాయి. చూసారా ఆముదం వెనక ఎన్ని లాభాలు ఉన్నాయో…!