చెడు కొలెస్ట్రాల్ దూరం చేసే అసాధారణ చిట్కాలు ఏంటో తెలుసా..?

-

శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాలను తొలగించుకోవాలి అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖ్యంగా మనం జీవించే జీవనశైలిలో మార్పుల కారణంగా.. తీసుకునే ఆహారంలో పోషకాల లోపం ఏర్పడినప్పుడు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ముఖ్యంగా వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా జబ్బుల బారిన పడతారు. శరీరంలో అధికంగా చెడు కొవ్వు పేరుకుపోయినప్పుడు గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అంతేకాదు ఈ వ్యాధితో అకస్మాత్తుగా మరణం సంభవించే ఆస్కారం కూడా లేకపోలేదు. ఇకపోతే ఇలాంటి వ్యాధులకు చెక్ పెట్టాలి అంటే కొన్ని చిట్కాలతో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.

శరీరం లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొలగించాలంటే ముందుగా డీప్ ఫ్రై చేసిన వంటకాలను తినకపోవడమే మంచిది. బయట రోడ్ సైడ్ దొరికే జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. మీరు మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే గుండె చుట్టూ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది . అంతేకాదు గుండె రక్తనాళాలు కూడా మూసుకుపోతాయి.. గుండెకు రక్త సరఫరా జరగకపోతే గుండె సడన్ గా కొట్టుకోవడం ఆగిపోతుంది.. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇక శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ దూరం చేయాలి అంటే ప్రతిరోజు వెల్లుల్లిని ఒకటి బాగా నమిలి మింగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా దూరం అవుతుంది. ఇక అలాగే తాజా ఆకుకూరలు, కాయగూరలు తిటూ ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అంది మలమూత్రం ద్వారా చెడు కొలెస్ట్రాల్ విసర్జించబడుతుంది. ఇక ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు అవిసె గింజలు ఒక స్పూన్ లైట్ గా వేయించి 15 రోజులు తీసుకుంటే గుండె ఆరోగ్యంగా తయారవుతుంది. ముఖ్యంగా ఖర్జూరాలు, సలాడ్లు, జామ పండ్లు, కర్బూజా, బొప్పాయి, పుచ్చకాయ వంటివి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి గుండె పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాదు బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి.. ఆరోగ్యంగా ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version