కమల్ హాసన్ ‘విక్రమ్’ బడ్జెట్ అన్ని కోట్ల..విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్‌ల రెమ్యునరేషన్ ఎంతంటే?

-

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘ విక్రమ్’ ఈ నెల 3న విడుదల కానుంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయంపై మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సూర్య, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించిన ఈ పిక్చర్…మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్నది.

ఇప్పటికే ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు పూర్తయ్యాయి. విశ్వనటుడు కమల్ హాసన్ ఈ మూవీ ప్రమోషన్స్ ను ముమ్మరంగా చేశారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పర్యటించిన సినిమాను ప్రమోట్ చేశారు. ఇక ఈ సంగతులు పక్కనబెడితే..ఈ చిత్ర బడ్జెట్, నటించిన స్టార్స్ రెమ్యునరేషన్ గురించి కోలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో డిస్కషన్ జరుగుతోంది.

ఫిల్మ్ బడ్జెట్ రూ.120 కోట్లకు పైగానే పెట్టారని తెలుస్తోంది. సినిమాలో ఉపయోగించిన గన్స్ లేటెస్ట్ మోడల్ కాగా, వాటి కోసం ఎక్కువ ఖర్చు అయినట్లు తెలుస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వీటిని తెప్పించినట్లు డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక కమల్ హాసన్ రెమ్యునరేషన్ గా రూ.50 కోట్ల మేర తీసుకున్నాడని సమాచారం.

డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ రూ.8 కోట్లు తీసుకోగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి రూ.10 కోట్లు, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ రూ.4 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ రూ.4 కోట్లు తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కమల్ హాసన్ సినీ ప్రేక్షకులకు చివరగా ‘విశ్వరూపం 2’ సినిమాలో కనిపించారు. ఆ తర్వాత ఇప్పుడు ‘విక్రమ్’గా ప్రేక్షకులను పలకరించనున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version