శ్రీవారి సన్నిధి అయిన తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. గత మూడు రోజుల్లో ఐదుకు పైగా కేసులు నమోదు అయ్యాయి. మొదటగా వివాహిత రేణుకా అదృశ్యం అయింది. భర్త కలసి బయటకు వెళ్ళి..రేణుక కనపడకుండా పోయింది. సత్యనారాయణ పురంలో మైనర్ బాలిక మోనిషా.. గుడి వెళ్ళి ఇంటికి రాలేదు. చెన్నా రెడ్డి కాలనిలో ఎనిమిదవ తరగతి చదువుతున్న వంశీ కృష్ణా .. ఐస్ క్రీం కోసం వెళ్ళి అదృశ్యం అయ్యాడు.
లక్ష్మీపురానికి చెందిన వివేక్ మిస్సింగ్ అంటూ ఫిర్యాదు అందింది. ఇక తిరుపతి లో మరో వివాహిత అదృశ్యం అయింది. పుట్టింటికి వచ్చిన ఆరో రోజు నుంచి కనిపించలేదు. 2019 లో నంద్యాల కు చెందిన నీటిపారుదల శాఖ జూనియర్ అసిస్టెంట్ మహేశ్వర్ కు రేణుకను ఇచ్చి పెళ్ళి చేసినా తల్లిదండ్రులు..ఈ మధ్య కాలంలో క్రికెట్ బెట్టింగ్ లో 35 లక్షలు అప్పు చేశాడు భర్త మహేశ్వర్.
గత నెల 31 తేదీన ఇంటిలో నుండి భర్త వద్దకు వెళ్ళిన రేణుక… కొద్దిసేపటికి రేణుక తండ్రికి మెసెజ్ పంపాడు భర్త మహేశ్వర్. మా ఇబ్బందులు మేము పడుతాం…మీరు ఆందోళన చెందవద్దు అంటూ మెసెజ్ పంపి కనిపించకుండా పోయారు భార్య,భర్తలు. దీంతో అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు రేణుక తండ్రి. దీంతో ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.