ఈ ఏడాది మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఏంటో తెలుసా..?

-

2022 సంవత్సరం మొదలయ్యి సుమారుగా నాలుగు నెలలు పూర్తి చేసుకుని ఐదవ నెల లోకి అడుగు పెట్టిన నేపథ్యంలో ఇప్పటివరకు విడుదలైన మొదటి రజే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.RRR:

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి హీరోలుగా.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.235 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాలో ఒలివియా మోరీస్ , ఆలియాభట్ హీరోయిన్లుగా నటించిగా.. అజయ్ దేవగన్ , శ్రేయ, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. Mm కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించగా, డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం.

2. KGF -2:

కన్నడ స్టార్ హీరో యష్ హీరో గా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.164.52 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి మరో రికార్డు సృష్టించింది. ఇక ఈ చిత్రానికి రవి బుస్సుర్ సంగీత దర్శకుడిగా పనిచేశారు.

3. బీస్ట్:

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.86.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

4. సర్కారు వారి పాట:

మహేష్ బాబు హీరో గా , కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది.

5. రాధేశ్యామ్:

ప్రభాస్ హీరోగా , రాధాకృష్ణ దర్శకత్వంలో.. పూజా హెగ్డే హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.67 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ చేసి డిజాస్టర్ గా మిగిలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version