Facts : మీకు తెలుసా?? రెస్టారెంట్‌కి వెళ్ళిన‌ప్పుడు.. మెనూ చూసి ఆర్డర్ ఇచ్చాక.. చేతులు కడుక్కోవాలి

-

మన చుట్టూ ఉండే విషయాలే, మన లైఫ్ లో డైలీ జరిగేవే..కానీ వాటిని ఎప్పుడూ మనం పెద్దగా పట్టించుకోం.. అలాంటి విషయాలు మనకు తెలిసినప్పుడు అవి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మీరు రెస్టారెంట్ కి చాలా సార్లు వెళ్లి ఉంటారు కానీ.. అక్కడ సాల్ట్ షేకర్లలో ఉప్పుతో పాటు.. బియ్యం గింజలు కూడా ఉంటాయి. అసలు అవి ఎందుకు ఉంటాయో తెలుసా..? పెళ్లిపై పెళ్లికి ముందు ఉన్న ఆసక్తి.. జనాలకు పెళ్లి తరువాత ఉండటం లేదట. ఇంకా ఇలాంటి చాలా విషయాలు మీకోసం..
  • ఎక్కువ మంది ఓటర్లు చిన్న గొంతు ఉండే అభ్యర్థులకు ఓటు వేస్తారని అధ్యయనాల్లో తేలింది.
  • సాధారణంగా ప్రజలు పెళ్లిపై… పెళ్లికి ముందు ఉన్నంత సంతృప్తిగా, పెళ్లి తర్వాత జీవితం పై ఉండరని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • ప్రపంచంలోని 90 శాతం రెస్టారెంట్లు.. మొదటి ఏడాది నిర్వహణలో పెయిల్ అయ్యాయట.
  • రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు గమనిస్తే సాల్ట్ షేకర్లలో ఉప్పుతోపాటూ బియ్యం గింజలు కూడా ఉంటాయి. ఎందుకంటే అవి ఉంటే ఉప్పు గడ్డలు కట్టకుండా పొడిగా ఉంటుందట.
  • తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఒత్తిడిని అనుభవిస్తే… ఆమెకు పుట్టే బిడ్డకు IQ (Intelligence quotient) తక్కువగా ఉంటుంది.
  • గ్లాస్ పగిలినప్పుడు… ఆ ముక్కలు గంటకు 4,828 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. అంటే సెకండ్‌కి 1.34 కిలోమీటర్లు. కాబట్టి పగిలిన వెంటనే క్లీన్ చేసుకోవాలి.
  • సముద్రంలో గడ్డి (Seaweed) రోజుకు 12 అంగుళాలు పెరగగలదు
  • ఎక్కువగా పరధ్యానంగా ఉండేవారికి సృజనాత్మకత (creativity) అధికంగా ఉంటుంది.
  • అనుప్తాఫోబియా (Anuptaphobia) అంటే ఒంటరిగా ఉండటానికి భయపడటం. ఇది చాలా మందికి ఉంటుంది. ఒక్కరే ఉంటే.. ఏదో తెలియని భయం వారిని వెంటాడుతూ ఉంటుంది.
  • విదేశాల్లో ప్రతి ఐదుగురు టీనేజ్ అమ్మాయిల్లో ఒకరు హైస్కూల్ చదివే రోజుల్లోనే ప్రెగ్నెంట్ అవుతున్నారట.
  • రెస్టారెంట్‌కి వెళ్లాక.. మెనూ చూసి ఆర్డర్ ఇచ్చాక.. అప్పుడు చేతులు కడుక్కోవాలి. ఎందుకంటే మెనూపై చాలా మురికి ఉంటుంది.
  • మనుషులు నిజంగా జరిగింది చెప్పేటప్పుడు ఎక్కువగా చేతులు ఊపుతారు. అదే కట్టుకథ చెప్పేటప్పుడు మాగ్జిమం చేతులు ఊపరట. ఈసారి గమనించండి.
  • కుడి చెవికి వినిపించేలా రిక్వెస్ట్ కోరినప్పుడు అది నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • మనం చాలా సందర్భాల్లో ముక్కులోని 2 రంధ్రాల్లో ఒక రంధ్రం నుంచే గాలి పీల్చుతూ ఉంటామట.
  • కాలి మడమ కింద 80 రకాల జాతుల బ్యాక్టీరియా జీవిస్తూ ఉంటుంది. కాబట్టి బయట నుంచి ఇంట్లోకి రాగానే.. కాళ్లు క్లీన్ చేసుకోవాలంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version