కార్తీకమాసం మొదలైంది కదా..మహిళలు ఇంకా కొంతమంది పురుషులు కూడా ప్రతి సోమవారం ఉపవాసం ఉండటం మొదలేస్తారు. కానీ మీకు తెలుసా ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో. ఏముంది నీరసం వస్తుంది అనుకుంటున్నారా..అలాకాదు..ఉపవాసం వల్ల శరీరం తనని తాను శుభ్రం చేసుకుని కొత్త శక్తి వస్తుందట..దాన్నే ఆటోఫజీ అనే వినూత్న జీవక్రియ వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని జపాన్ కు చెందిన శాస్త్రవేత్త యోషినోరి ఓఘమి అంటున్నారు. ఆయన ఉపవాసం వల్ల ఏం జరుగుతుందో వివరంగా చెప్పారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు
అవునండి ఉపవాసం వల్ల శరీరంలో దెబ్బతిన్న కణాలు తమను తాము తినటం లేదా తమను తాము నాశనం చేసుకోవటం వల్ల గ్రోత్ హార్మన్ పెరుగుతుంది. తద్వారా కొత్త కణాలు ప్రేరేపితమవుతంది. దీన్నే వైద్య భాషలో ఆటోఫజీ అంటారట. మనం డైలీ తినే ఆహారం, జంక్ ఫుడ్ అలా సగం జీర్ణం అయినా..కొవ్వు రూపంలో పేరుకుపోతూనే ఉంటుంది. సాధారణంగా ఇదంతా డైలీ వ్యాయామం చేస్తే కరిగిపోతుంది అంటారు. కానీ మనకున్న బిజీ షెడ్యూల్ అంత టైం ఎలాగో ఉండదు. ఇలా ఉపవాసం చేయటం వల్ల శరీరంలో పేరుకుపోతూ ఉండే పాడైన, చనిపోయిన కణాలను శరీరం తనంతట తానుగా తొలగించుకుంటుంది.
సాధారణంగా కొత్త కణాలన్నీ ఈ ఆటోఫజీ ఆధారంగానే పుట్టుకొస్తుంటాయి. అవి పుట్టేటప్పుడు పైపొరల్ని తయారు చేసుకునే క్రమంలో చనిపోయిన, మరమ్మత్తు అవసరమైన కణాల్ని వాడుకుని వాటిని చీల్చి, మాలిక్యూల్స్‌ని శక్తిగా వాడుకుంటాయి. ఈ చర్య ఉపవాసంలో ఉన్నప్పుడు ఎక్కువగా జరుగుతుంది, కాబట్టి ఉపవాసం వల్ల ఆరోగ్యపరమైన లాభం పొందవచ్చని జపనీస్ సైంటిస్ట్ ‘యోషినోరి ఓషుమి’ అంటున్నారు.
సింపుల్ గా చెప్పాలంటే..
ఉపవాసంలో ఉన్నప్పుడు తినటానికి ఆహారం అందుబాటులో లేదని, లేదా ఏం తినకూడదు అనే విషయాన్ని మన శరీరం మెదడుకు తెలుపుతుంది. దాంతో మెదడు నిల్వ ఉన్న శక్తిని వినియోగించమని శరీరాన్ని ఆదేశిస్తుంది. అప్పుడు శరీర కణాలు శక్తి కోసం పాతవి, వయసు మీరినవి అయిన పనికిరాని ప్రొటీన్ల మీద దాడి చేస్తాయట.. ఇలా ఎందుకు జరుగుతుందంటే?… ఆహారం శరీరానికి అందనప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ పడిపోతాయి..దానికి వ్యతిరేకమైనదైన గ్లూకగాన్ విజృంభించటం మొదలుపెడుతుంది. ఈ గ్లూకాగాన్ యాక్టివేట్ అయి శరీరంలో శుభ్రం చేయాల్సిన, నిరర్ధకంగా పడిఉన్న కణాల మీదకు దృష్టి మళ్లిస్తుంది. ఆ క్రమంలో గ్రోత్ హార్మోన్ ప్రేరేపితమై పాత కణాల స్థానంలో కొత్త శక్తివంతమైన కణాల తయారీ మొదలవుతుంది.
ఇంత జరుగుతుందా శరీరంలో ఉపవాసం ఉన్నప్పుడు అనుకుంటున్నారా..అయితే ఏదో ఒకసారి అంటే ఉపవాసం ఉండటం మంచిది. కానీ అదేపనిగా వారానికి రెండుసార్లు, మూడుసార్లు ఉపవాసం ఉంటే..అసలు మీ శరీరంలో పాడైన కణాలు ఉండకపోతే..శరీరం ఏం చేస్తుంది ఇక..శక్తిని అందించలేక డీలా పడిపోతుంది. తద్వారా నీరసం వచ్చి అనారోగ్యసమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మీరు గమనించే ఉంటారు..ఒకవేళ కంటిన్యూస్ గా రెండు రోజులు ఉపవాసం ఉంటే..మొదటిరోజు ఉన్నంత ఎనర్జీ రెండో రోజు ఉండదు.