అలర్ట్ : ఏపీకి మూడు రోజుల పాటు భారీ వర్షాలు !

-

ఏపీకి మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద గల ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టమునకు 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఒక అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసరాల్లో ఏర్పడే అవకాశం ఉంది ,తరవాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా ఉత్తర తమిళనాడు తీరానికి నవంబర్ 11, 2021 ఉదయం నాటికి చేరుకుంటుంది.

పశ్చిమ మధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అనగా ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ ఆంధ్రా తీరము వద్ద సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నఉపరితల ఆవర్తనం ఇపుడు బలహీన పడింది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనలు చేసింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రము స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version