వాస్తు: పావురాలు ఇంట్లో ఉంటే ఏమౌతుందో తెలుసా?

-

అడవులు తగ్గిపోవడంతో పక్షులు ఇళ్లల్లోకి వస్తున్నాయి.. ఇళ్లల్లో గూడ్లు పెట్టుకొని నివసిస్తున్నాయి..అన్ని చోట్లా చెట్లు, మొక్కలను నరికివేసి కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. అందుకే నగరాలు, పట్టణాల్లో పక్షులకు ఆవాసం దొరకడం లేదు. ఈ క్రమంలోనే పిచ్చుకలు, పావురాలు ఇళ్లలోకి వస్తున్నాయి.పావురాలు, పిచ్చుకలు ఇళ్లలో గూడు కట్టుకోవడం మనం చూస్తుంటాం. ఆ పక్షుల కిలకిల రావాలతో ఇళ్లంతా సందడిగా ఉంటుంది. అనేక గ్రంథాల్లో కూడా పక్షుల ఇంట్లో గూడు కట్టుకునే ప్రస్తావన ఉంది. మరి మన ఇళ్లలో పావురాలు, పిచ్చుకలు గూడు కట్టుకోవడం మంచిదా? కాదా? అనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇంట్లోకి పావురం వచ్చి గూడు కట్టుకోవడం అంటే మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు రావడం ప్రారంభమవుతుందని భావించాలి. ఇంట్లోకి పావురాలు వస్తున్నాయంటే.. అది ఆనందం, శాంతి రాకను సూచిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. తక్కువ సమయంలో పెద్ద విజయం సాధించబోతున్నారని సంకేతం..ఇక వాటికి ఆహారం వేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. కానీ పావురాలకు ఇంటి పైకప్పు మీద గింజలు వేయకూడదు. ఇంటి ప్రాంగణంలో గింజలు వేస్తే మంచి జరుగుతుంది. జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే పావురానికి ఆహారం ఇవ్వాలి. ఇలా చేస్తే బుధ గ్రహం నుంచి వచ్చే అశుభ ప్రభావాలు తగ్గుతాయి..

పక్షులకు ధాన్యం, నీరు ఇస్తే ఎంతో పుణ్యం వస్తుందని అనేక శాస్త్రాల్లో చెప్పారు. పక్షులు ఇంట్లో గూడు కట్టుకుంటే.. వాస్తు దోష వల్ల కలిగే దుష్ఫలితాలు తొలగిపోతాయి..అంతేకాదు లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉంటుంది.ఇంట్లో పావురాల్లు గూడు కడితే లేదని వాస్తు, జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో నివసించే వారికి అదృష్టం పెరుగుతుందని పేర్కొన్నారు. అయితే పావురాలు ఎక్కడేక్కడో తిరిగి ఎన్నో క్రిములను వెంటబెట్టుకొని వస్తాయి..ఈ విషయం లో మాత్రం జాగ్రత్త వహించాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version