ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే ఎక్కడ మార్చాలో తెలుసా?

-

బ్యాంకులలో డబ్బులను అధిక మొత్తంలో తీసుకున్నా లేదా ఏటీఎంలో డబ్బులను విత్ డ్రా చేసినప్పుడు ఒక్కోసారి చిరిగిన నోట్లు రావడం మనం చూస్తూనే ఉంటాం..చిన్న నోటు వస్తే పర్లేదు..కానీ ఐదు వందలు,రెండు వేలు రుపాయల నోట్లు వస్తే మాత్రం కస్టమర్లు టెన్షన్ పడుతుంటారు.చిరిగిపోయిన నోట్లు చెల్లవని, అవి ఎలా మార్చుకోవాలనే దానిపై ఆందోళన చెందుతుంటారు.

అలాంటి నోట్లు మీ వద్ద ఉంటే ఎవ్వరు తీసుకోరు. అలాంటప్పుడు ఈ నోట్లను మార్చుకునే మార్గాలను సూచిస్తోంది సెంట్రల్‌ బ్యాంకు. అందుకు సులభమైన పరిష్కారం చూపిస్తోంది. మీకు ఏటీఎంలలో చిరిగిపోయినా, నకిలీ నోట్లు వచ్చినట్లయితే వాటిని బ్యాంకులు డిపాజిట్‌ చేసుకుని కొత్త నోట్లను తీసుకోవచ్చని ఆర్బీఐ చెబుతోంది. ఇందు కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. బ్యాంకు సిబ్బంది ఆ నోట్లను తీసుకుని మీకు మంచి నోట్లను అందజేస్తుంది.

అయితే ఏటీఎంల నుంచి చిరిగిన కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను రూపొందించింది. ఈ నియమం ప్రకారం.. చిరిగిన నోట్లు బ్యాంకు ఏటీఎం నుండి వచ్చినట్లయితే ఈ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకు నిరాకరించదు. నోట్ల మార్పిడి ప్రక్రియ చాలా సులభం. జూలై 2016లో ఆర్‌బీఐ అటువంటి నోట్లను మార్చడానికి సర్క్యులర్ కూడా జారీ చేసింది. బ్యాంకు నోట్లను మార్చుకోవడానికి నిరాకరిస్తే ఆ బ్యాంకులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరికలు జారీ చేసింది.

ఏటీఎంకు సంబందించిన బ్యాంక్ నోట్ల మార్పిడి పై అభ్యంతరం తెలిపితే 10 వేలు జరిమానా కూడా వెయ్యొచ్చు.చిరిగిన నోట్లు వస్తున్నాయంటే ఆ బాధ్యత బ్యాంకుపైనే ఉంటుంది. అలాంటి నోట్లను మార్చుకునే బాధ్యత బ్యాంకుదే. అందుకే ఏటీఎంలోనే నోట్లను డిపాజిట్ చేసేటప్పుడు వాటిని సరిచూసుకోవడం బ్యాంకు పని.

నోటు సీరియల్ నంబర్, మహాత్మా గాంధీ వాటర్‌మార్క్, గవర్నర్ సంతకం వంటివి కనిపించకపోతే అది నకిలీ నోటు అని గుర్తించి నోటును మార్చుకోవాలి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి గరిష్టంగా 20 నోట్లను మార్చుకోవచ్చు. వాటి విలువ రూ.5000 మించకూడదు. నోట్స్ మార్చుకోవడానికి సదరు వ్యక్తి ఒక అప్లికేషన్ రాయాల్సి ఉంటుంది. మీరు తేదీ, సమయంతో పాటు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసిన మొత్తం వివరాలను అందులో నమోదు చేయాలి. అలాగే ఏ నోటు చిరిగిపోయిందో, ఏటీఎం స్లిప్‌ను జత చేయాల్సి ఉంటుంది..అప్పుడే మీకు బ్యాంకు చిరిగిన నోటు స్థానంలో కొత్త నోటును ఇస్తుంది…

Read more RELATED
Recommended to you

Exit mobile version