కాలికి నల్ల తాడుని ఎందుకు కట్టుకుంటారో తెలుసా..?

-

మనం ఎప్పుడైనా గమనించినట్లైతే చాలా మంది కాళ్ళకి నల్లటి తాడుని కట్టుకుంటారు. అయితే ఇది స్టైల్ కోసం అని కానీ నచ్చి కానీ అనుకుంటే పొరపాటు. ఇలా నల్లటి తాడుని కాలికి కట్టుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. అదే విధంగా అదృష్టం కలిసి వస్తుంది. అయితే చాలా మంది చేతికి లేదా కాలికి కానీ మెడకి కానీ కట్టుకుంటూ ఉంటారు.

భారతదేశంలో ఈ నల్లటి తాడు మీద చాలా నమ్మకాలు ఉన్నాయి. దిష్టి తగలకుండా కూడా ఇది చూసుకుంటుంది అని చాలా మంది నమ్ముతారు. అలానే కాళ్ళకి కట్టుకోవడం వల్ల కాలు నొప్పి కూడా తగ్గుతుందని చాలా మంది అంటారు. బాబా భైరవ్నాథ్ గుడి నుంచి ఇటువంటి తాళ్లను తెచ్చుకుని కట్టుకుంటారు. అలా చేస్తే సమస్యలు తొలగిపోతాయట.

ఈ నల్లటి దాడికి సంబంధించి చాలా నమ్మకాలు ఉన్నాయి. అయితే జ్యోతిష్యం ప్రకారం ఈ తాడుని కట్టుకుంటే మనకి రక్షణగా ఉంటుంది. శని దేవుడిని పూజించి ఆ తర్వాత ఆ తాడుని కట్టుకుంటే చెడు కలగకుండా ఉంటుంది. తాడుని కట్టుకోవడానికి ముందు తొమ్మిది ముడులు వేయండి దానివల్ల మరింత మంచి కలుగుతుంది.

మీరు ఒకవేళ కనుక చేతికి కట్టుకోవాలి అనుకుంటే అప్పుడు 2,4,6,8 సార్లు ఆ తాడుని తిప్పి కడితే మంచిది. నల్లటి తాడు ధరించేటప్పుడు మరి ఏ ఇతర తాడు కూడా ధరించకూడదు. అదేవిధంగా నల్ల తాడు తో నిమ్మకాయలు ఇంటికి కడితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. అలానే మంచి కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version