కృష్ణకు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ నాగార్జున్ని డిమాండ్ చేసిన ఆయన అభిమానులు ఎందుకో తెలుసా..

-

సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున కలిసి నటించిన చిత్రం వారసుడు.. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.. అయితే ఈ సినిమాలో జరిగిన ఓ సంఘటన వల్ల నాగార్జున కృష్ణకు క్షమాపణలు చెప్పవలసి వచ్చిందట..

నాగార్జున నగ్మా జంటగా నటించిన వారసుడు చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ ఓ ప్రముఖ పాత్ర పోషించారు.. ఈ చిత్రానికి ఇవి సత్యనారాయణ దర్శకత్వం వహించారు.. హిందీ చిత్రం ఫూల్ ఔర్ కాంటేకు రీమేక్ గా తెరెకెక్కింది ఈ సినిమా. ఇందులో కృష్ణ స్మగ్లర్ గా కనిపిస్తారు. కృష్ణ కొడుకుగా నాగార్జున కనిపించగా.. కృష్ణ స్మగ్లర్ గా కనిపిస్తారు. అయితే తండ్రిని ద్వేషించే కొడుకుగా ఈ చిత్రంలో కనిపించిన నాగార్జున.. కొంత వయసు వచ్చిన తర్వాత తండ్రి నుంచి దూరమై వచ్చేస్తాడు. అయితే నాగర్జున నగ్మా ని పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరికీ ఒక బాబు పుడతాడు. ఆ బాబును కృష్ణ ఎత్తుకొస్తాడు.. ఆ బాబు కోసం అయినా తన కొడుకు తన దగ్గరకు వస్తాడని ఆశతో అలా చేస్తాడు. అయితే అసలు విషయం తెలుసుకున్న నాగార్జున వెంటనే కృష్ణ దగ్గరకు వచ్చి నా కొడుకు ఎక్కడ అంటూ అతని షర్ట్ కాలర్ పట్టుకొని నిలదీస్తాడు.. అయితే చివరకు కథ సుఖాంతం అయినప్పటికీ.. అప్పటికే పెద్ద స్టార్ అయిన కృష్ణను అలా చూపించడం ఆయన అభిమానులు తట్టుకోలేక పోతారు. ఇలా చేయడం ఎంత మాత్రం సరికాదు అంటూ నాగార్జునతో క్షమాపణలు చెప్పించాలని అప్పట్లో పెద్ద రచ్చే చేశారట కృష్ణ అభిమానులు.. అయితే ఈ గొడవ ఎంతకీ సద్దుమనగకపోవడంతో చివరికి నాగార్జున, కృష్ణ ఇద్దరూ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.. అయితే అప్పటికి కానీ కృష్ణ అభిమానులు శాంతించలేదట. 1993 లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.. అంతేకాకుండా 90ల్లో వచ్చిన ఓ సూపర్ హిట్ మల్టీ స్టార్ మూవీగా నిలిచిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version