ఆయిల్ ట్యాంకర్లు ఎందుకు రౌండ్ గా వుంటాయో తెలుసా..?

-

ఎప్పుడైనా మనం చూసినట్లయితే ఆయిల్ ట్యాంకర్లు మరియు వాటర్ ట్యాంకర్లు గుండ్రంగా ఉంటాయి. మిగిలినవి చూడడానికి ఫ్లాట్ గా ఉంటాయి. అయితే ఎందుకని వాటర్ ట్యాంకర్లు, ఆయిల్ ట్యాంకర్లు గుండ్రంగా ఉంటాయి అని చూస్తే… కొన్ని చతురస్రాకారంలో ఉంటాయి మరి కొన్ని దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. కానీ నీటిని తీసికెళ్ళేవి, ఆయిల్ ని తీసికెళ్ళేవి ఎప్పుడూ గుండ్రంగా ఉంటాయి.

రౌండ్ ఎకరం తో పాటు కొన్ని సిలిండ్రికల్ ఆకారములోను కూడా ఉంటాయి. అయితే ఎందుకు ఇవి గుండ్రంగా ఉంటాయి అని అనుకున్నారా అయితే మరి దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. నీటి ట్యాంకర్లు కానీ ఆయిల్ ట్యాంకర్లు కానీ రౌండ్ గా ఉంటే వాటిపై ఒత్తిడి తక్కువగా పడుతుంది. అదే ఒకవేళ ఇతర ఏ ఆకారంలో ఉన్న ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. పైగా చివర్న మరింత ఒత్తిడి పడుతుంది.

ఒత్తిడి పాడడం వల్ల వేగంగా వాహనాలు వెళ్ళలేవు. పైగా ఇబ్బందులు కూడా వస్తాయి. అలాగే లిక్విడ్ ఎక్కువ బరువుతో ఉంటాయి. కాబట్టి ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుంది. అందుకని స్థిరత్వం కలిగి ఉండే వాహనాలను ప్రిఫర్ చేస్తారు.

మండే ద్రవపదార్థాలు కానీ నీళ్లు వంటి పదార్థాలు కానీ స్థిరత్వాన్ని కోల్పోకుండా ఎక్కువ సమయం ఉండాలి. అలా స్థిరత్వం ఉండాలంటే గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండాలి అంటే భూమికి బాగా దగ్గరగా ఉండాలి. అందుకనే గుండ్రంగా ఉండే వాటినే ప్రిఫర్ చేస్తారు. ఈ కారణము వల్లే రౌండ్ గా ఉండే వాటిని ఉపయోగించి నీటిని లేదా ఆయిల్ ని తీసుకుని వెళ్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version