ప్రతిసారి తలనొప్పికి మాత్ర వేసుకుంటున్నారా..ఓసారి ఈ పరిమళమైన ఆయిల్స్ ట్రై చేయండి..!

-

తలనొప్పి సమస్య..చాలా చిన్నదే అయినా..ఆ బాధ భరించేవాళ్లకే తెలుస్తుంది..కంటికనిపించని జబ్బులో లోపల యుద్ధం చేసినట్లే..పక్కనవాళ్లకు ఏం అర్థంకాదు..ఏ జ్వరమో, జలుబో అయితే కనపిస్తుంది.. తలనొప్పి ఏం కనిపించదు కదా..తలపట్టేసుకుని మనమే బాధపడుతూ ఉండాలి. దీనివల్ల మనిషి చాలా డిస్టబ్ అవుతాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. మూడ్ అంతా మారిపోతుంది.

టాబ్ లెట్ వేసుకుంటే కానీ తగ్గదు కొన్నిసార్లు. కానీ తరచూ తలనొప్పి వస్తుంటే మీరు ప్రతిసారి టాబ్ లెట్ వేసుకోవటం మంచిదికాదు. అసలు ఎందుకు వస్తుంది కారణం ఏంటో తెలుసుకోవాలిగా..తలనొప్పికి ఎక్కువగా ఉండేకారణాలు..ఒత్తిడి, నిద్రలేమి, అతిగా ఆలోచించటం. వీటిల్లో ఏదోఒక దానివల్లే మీకు తలనొప్పి వస్తుంటుంది. ఇ‌వి కాకుండా కూడా కొన్ని రీజన్స్ ఉంటాయిలేండి. అయితే తలనొప్పికి సహజసిద్దమైన పరిష్కారం ఉంది. కొన్ని రకాలు పరిమళమైన ఆయిల్స్ తో తలనొప్పిని మాయం చేసేయొచ్చట. అవేంటో ఇప్పుడు చూద్దాం.!

పెప్పర్‌మెంట్‌ నూనె తలనొప్పి, కండరాల నొప్పి, దురద, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. కెమోమిలా నూనె నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. ఇలా తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన తగ్గటానికీ దోహదం చేస్తుంది. యూకలిప్టస్‌ నూనె పుండ్లు నయం కావటానికి, రక్తంలో గ్లూకోజు నియంత్రణలో ఉండటానికి, నంజుపొక్కులు తగ్గటానికి ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది.

లావెండర్‌ నూనె దిగులు, ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. ఇది పార్శ్వనొప్పి నుంచీ ఉపశమనం కలిగిస్తుంది. మనసుకు ప్రశాంతను ఇస్తుంది. డిస్టర్బ్ గా ఉన్నవాళ్ల మైండ్ కూడా లావెండర్ నూనె వాసనకు సెట్ అయిపోతుందట. స్టీమ్ డిస్టిలేషన్ ప్రాసెస్ లో రెడీ అయ్యే లావెండర్ నూనెకు చాలా ప్రత్యకతలు ఉన్నాయి. శరీరం రిలాక్స్ అయ్యేలా చేయడం మాత్రమే కాదు… నీరసం కూడా దూరం చేస్తుందట. దాంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే.. గాఢంగా ఉండే పరిమళ నూనెలను నేరుగా చర్మానికి రాసుకోకూడదు. ఇతర నూనెల్లో కలిపి రాసుకోవాలి. టిష్యూ కాగితం మీద రెండు మూడు చుక్కలు వేసి వాసన పీల్చుకోవచ్చు. రూమ్‌ ఫ్రెష్‌నర్‌లోనూ కొన్ని చుక్కలు కలుపుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన ఫ్లేవర్ ఉన్న ఆయల్ ను ఎంచుకుని తలనొప్పికి ట్రై చేయండి. కెమికల్సతో కూడిన టాబ్ లెట్ ప్రతిసారి వాడటం కంటే ఈ ఆయిల్స్ ను అప్పుడప్పుడు ట్రై చేయటం బటరే కదా.!

Read more RELATED
Recommended to you

Exit mobile version