అప్పుడప్పుడు ఆల్కాహాల్‌ తాగితే ఏం కాదులే అనుకుంటున్నారా..?

-

ఆల్కాహాల్‌ ఆరోగ్యానికి మంచిదని కొంతమంది అంటారు..కాదు అది చెడ్డ అలవాటు అని ఇంకొంత మంది అంటారు. ఎక్కువగా తాగితేనే డైంజర్‌.. అప్పుడప్పుడు తాగితే ఏం కాదు అని మీరు కూడా అనుకుంటున్నారు.. కానీ ఆల్కాహాల్‌ ఎప్పుడు తాగినా ప్రమాదమే అని తాజా పరిశోధనలో తేలింది.
ఆల్కహాల్ వల్ల కలిగే లాభనష్టాలపై కూడా ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. మితమైన మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటే అది హాని చేయదని చాలా పరిశోధనలలో ప్రూవ్‌ చేశారు.. అయితే ఆల్కహాల్ ఎంత తక్కువగా తీసుకున్నా అది ఆరోగ్యానికి మంచిది కాదని తాజా పరిశోధనలో తేలింది. ఒక పరిశోధన ప్రకారం.. 2015, 2019 మధ్య, మద్యం కారణంగా USAలోనే 140,000 మంది మరణించారు. ప్రమాదాలు 40 శాతం మరణాలకు కారణమయ్యాయి, అయితే ఎక్కువ కేసులు కాలేయ వ్యాధి, క్యాన్సర్, గుండె జబ్బుల వల్ల సంభవించాయి.
ఇప్పటి వరకు యుఎస్ డైటరీ గైడ్‌లైన్స్ ప్రకారం.. పురుషులు రోజుకు 2 గ్లాసుల మద్యం, మహిళలు 1 గ్లాసు వరకు తాగవచ్చని సూచించింది. కానీ ఇప్పుడు ఈ మద్యపానం పరిమితి కూడా హాని కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు.
ఆల్కహాల్ మానవ DNAను దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మీరు ఆల్కహాల్ తాగినప్పుడు, మీ శరీరం దానిని ఎసిటిక్ యాసిడ్‌గా విడదీస్తుంది. దీనివల్ల DNA దెబ్బతింటుంది. అలాగే DNA ను రిపేర్ చేయడానికి మీ శరీరం అనుమతించదు. మీ DNA దెబ్బతిన్న తర్వాత, కణాలు నియంత్రణ లేకుండా పెరుగుతాయి. అవి క్యాన్సర్ కణితులుగా మారవచ్చు.
ఆల్కహాల్ కూడా ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది రక్త నాళాలను దెబ్బతీస్తుంది. రక్తపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంది. డీఎన్‌ఎపై ప్రభావం చూపే ఏ సమస్య అయినా.. శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.
కాబట్టి.. అప్పుడప్పుడు..అకేషన్స్‌లో మాత్రమే మద్యం తాగుతున్నాం కదా.. మనకు ఏం కాదులో అనుకోవడానికి లేదు. ఒక్కర్ని చంపినా, వంద మందిని చంపినా ఒకటే శిక్ష.. అలాగే.. రోజూ తాగినా, అప్పుడప్పుడు తాగినా తప్పు తప్పే.. సమస్యే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version