అమరావతి : ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. నేడు డాక్టర్ వైఎస్సార్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ ఏకంగా… 500 ఏసీ వాహనాలను ప్రారంభించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇవాళ ఉదయం పది గంటలు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.
ఏడాదికి సగటున 4 లక్షల మందికి అందుబాటులోకి రానున్నాయి సేవలు. ప్రభుత్వ హాస్పిటల్ లో కాన్పు అయిన తల్లీ, బిడ్డలను ఉచితంగా ఇంటికి చేర్చటం కోసం ఈ ప్రత్యేక వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. జీపీఎస్ సౌకర్యంతో ఈ వాహనాలు నడువనున్నాయి.
ఈ సేవల సమన్వయం కోసం తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. డా.వైఎస్సార్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల కోసం టోల్‌ఫ్రీ నెంబర్ 102 ను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక ఈ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు పోలీసులు.