కరోనా వైరస్ కట్టడి చేయటానికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ముప్పు తిప్పలు పడుతున్నాయి. ప్రపంచంలోనే ధనిక దేశాలు, అగ్రరాజ్యాలు అనిపించుకునే దేశాలు కరోనా నీ ఎదుర్కోవటానికి చెయ్యని ప్రయత్నం లేదు. ఇటువంటి టైం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కరోనా వైరస్ విషయంలో తీసి పారేసే విధంగా చాలా ఈజీగా తీసుకోవడాన్ని వైద్యులు తప్పుబడుతున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఊహించని విధంగా చాలా ప్రమాదకరంగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ విధంగా మరో రెండు వారాలు ఉంటే రాష్ట్రంలో మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.