ఫ్రిడ్జులో పెట్టిన చపాతీ పిండి నల్లగా అవుతుందా..? ఇలా చేయండి

-

చపాతీ పిండితో ఎప్పుడు ఏదో ఒక పంచాయితీ ఉంటుంది. ఒక్కోసారి మెత్తగా ఉండదు, ఒక్కోసారి ఎంత కొలతలు వేసుకుని కలిపినా మిగిలిపోతుంది. మిగిలింది ఫ్రిడ్జ్‌లో పెడితే అది నల్లగా అవుతుంది. మీరు ఇలాంటి సమస్యను ఎదుర్కొనే ఉంటారు కదా..! ఫ్రిడ్జ్‌లో పెట్టిన చపాతీ పిండి నల్లగా అవకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చపాతీ పిండిని కలుపుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు, పిండి త్వరగా పాడవదు. అంటే పిండిని పిసుకుతూ నీళ్లలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి కరిగిన తర్వాత మెత్తగా కలపాలి. ఇలా చేయడం వల్ల పిండి త్వరగా పాడవదు. నల్లగా కూడా మారదు. ఇలా చేసిన వెంటనే చపాతీ కాల్చుకుంటే మెత్తగా ఉంటుంది. తర్వాత మిగిలిన పిండిని గాలి చొరబడని డబ్బాలో ఉంచండి.

ఫ్రిజ్‌లో ఉంచిన చపాతీ పిండి మెత్తగా ఉండాలంటే ఏం చేయాలి?:

చాలాసార్లు ఫ్రిజ్‌లో ఉంచిన చపాతీ పిండితో చపాతీలు చేసినప్పుడు అవి మెత్తగా ఉండవు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గం ఉంది. ఫ్రిడ్జ్‌లో ఉంచిన చపాతీ పిండిని తీసిన తర్వాత అందులో పైన రెండు లేదా మూడు చెంచాల నీళ్లు పోసి మూతపెట్టి 10 నిముషాల తర్వాత కాస్త ఎండు పిండితో ముద్దలా చేస్తే చపాతీ మెత్తగా ఉంటుంది.
చపాతీ పిండిని ఎక్కువ సేపు నిల్వ ఉంచుకోవడం ఎలా: చపాతీ పిండిని ఫ్రిజ్‌లో ఉంచేటప్పుడు కొద్దిగా నూనె పోయాలి. ఆ తర్వాత, గాలి చొరబడని కంటైనర్‌లో సీల్ చేసి ఫ్రిజ్‌లో ఉంచండి. ఇలా చేస్తే చపాతీ పిండి ఎక్కువ సేపు ఉంటుంది. త్వరగా పాడవదు.
అసలు చపాతీ పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా ఉంచేదే మేలు.. ఎందుకంటే.. ఫ్రిడ్జులో పెట్టిన చపాతీ పండితో చపాతీలు చేసుకుని తరచూ తింటే.. ఆరోగ్యం పాడవుతుంది. ఎప్పుడో ఒకసారి అయితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోని పెడితే చాలు. ముందు రోజు చేసిన చపాతీలను ఉదయం తినడం ఆరోగ్యానికి మంచిదే. మీకు కొంచెం పిండి మిగిలితే వాటితో కూడా చపాతీలు చేసి పక్కన పెట్టుకోండి. ఫ్రిడ్జులో పెట్టాల్సిన అవసరం లేదు. ఉదయం లేచిన తర్వాత టిఫెన్‌లా ఆ చపాతీలనే తింటే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version