ఫోన్ బాగా వేడెక్కుతుందా.. వెంటనే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. లేకుంటే భారీ నష్టం..

-

వేసవికాలంలో వాతావరణం ఎంత వేడెక్కుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..మనుషులతో పాటు వస్తువులు కూడా వేడి ఎక్కుతాయన్న విషయం తెలిసిందే..అలానే నిత్యం మన చేతుల్లో ఉండే ఫోన్ కూడా బాగా వేడిగా అయిపోతుంటుంది. ఇది ఫోన్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఈ వేసవిలో మీ ఫోన్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది.. అయితే కొన్ని సార్లు కూడా ఫోన్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.. ఫోన్ ను కూల్ గా ఉంచేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

*. స్మార్ట్‌ఫోన్‌లు కూడా దాని పరిసరాల నుండి వేడిని గ్రహిస్తాయి. కాబట్టి, మీ పరికరాలను నేరుగా సూర్యకాంతిలో ఉంచకపోవడమే మంచిది. మీరు చార్జింగ్ చేస్తున్నప్పుడల్లా మీ ఫోన్ చల్లని పొడి ప్రదేశంలో (నీడలో) ఉంచినట్లు నిర్ధారించుకోండి. బ్యాటరీని ఛార్జ్ చేయడం వల్ల వేడెక్కుతాయి..

*. అలాగే, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌ను డ్యాష్‌బోర్డ్‌లో ఉంచవద్దు. ఇది గాజు/విండ్‌షీల్డ్ నుండి వచ్చే ప్రత్యక్ష సూర్యకాంతి ఫోన్ పై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది..

*. మీరు ఎక్కువసేపు సూర్యకాంతిలో ఉన్నట్లయితే, ఫోన్‌ని సుదీర్ఘ సంభాషణల కోసం ఉపయోగించడం మానుకోండి. మీరు ఎండలో ఉంటే, మీ స్మార్ట్‌ఫోన్ సాధారణం కంటే ఎక్కువ వేడిగా ఉందని భావిస్తే కొంత సేపు దానిని పక్కన పెట్టండి.. కాస్త వేడి తగ్గాక వాడితే మంచిది..

*. పౌచ్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడం మంచి పద్ధతి. ఇది ప్రమాదవశాత్తు ఫోన్ కింద పడిపోయినప్పుడు అవసరమైన రక్షణను అందిస్తుంది. అయితే, మీ ఫోన్ వేడెక్కుతున్నట్లు మీకు అనిపిస్తే, కొంత సమయం పాటు కవర్‌ నుంచి ఫోన్ బయటకు తీయడం ఉత్తమం..

*.ఎండలో బయట పార్క్ చేసిన కార్ల లోపల మీ ఫోన్‌ని ఉంచవద్దు. యాపిల్ సంస్థ ప్రకటించిన దాని ప్రకారం, 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో యాపిల్ ఐఫోన్ ఉంచితే దాని బ్యాటరీకి హాని కలుగుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లకు సంబంధించి ఎటువంటి నివేదిక లేదు. కానీ అది అదే విధమైన ప్రభావం వీటిపై కూడా ఉండే అవకాశం ఉంది.. ఇది గమనించండి.. ఏదేమైనా ఫోనలను ఎండలో ఉన్నప్పుడు ఎక్కువగా వాడక పోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.. ఇది గుర్తుంచుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version