జంగారెడ్డి గూడెం నుంచి తిరుపతికి పాదయాత్రగా కుక్క !

-

ఒక్కో విషయం వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ నమ్మక తప్పదు. పాలు పోశారన్న విశ్వాసమో లేక ఏనాడో తిరుపతి మొక్కు ఉండిపోయిందో తెలియదు కానీ తో శునక రాజం ఇద్దరు భక్తులతో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి తిరుపతికి 620 కిలోమీటర్ల మేర కాలినడకన తోడు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే జంగారెడ్డిగూడెం కు చెందిన ముడి ప్రతాపరెడ్డి, అతని స్నేహితుడు రవి మార్చి 15వ తేదీన కాలినడకన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి బయల్దేరారు. ప్రతాపరెడ్డి కాలినడకన వెళ్లడం ఇది మూడోసారి అయితే వీరు బయలుదేరే ముందు తమతో ఎవరయినా కాలినడకన వస్తే వారి ఖర్చులు కూడా తామే పెట్టుకోవాలని అనుకున్నారు.

కానీ మనుషులు ఎవరూ తోడు రాలేదు కానీ రెండు కుక్కలు వచ్చాయి. అందులో ఒక కుక్క కొంత దూరం వచ్చి తప్పుకోగా మరో కుక్క తిరుపతి దాకా వచ్చింది. అయితే అలిపిరి వద్ద దానిని కొండ ఎక్కనివ్వలేదు. దీంతో బంధువుల ఇంట్లో దానిని ఉంచి తిరిగి వచ్చేప్పుడు ఇంటికి తెచ్చుకున్నాడు ప్రతాప్ రెడ్డి. బంధువుల ఇంట్లో ఉంచినపుడు అది తిండి కూడా తినలేదని, తనను వీడియో కాల్ లో చూపించాక అది పాలు తాగిందని చెప్పుకొచ్చారు ఆయన. ఇక డాక్టర్ దగ్గారకు తీసుకు వెళ్ళగా అది అప్పటికే గర్భవతి అని చెప్పారట. మరో వారం పది రోజుల్లో అది పిల్లల్ని కనే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version