ఆంధ్రప్రదేశ్ లో రానున్న 3 రోజులు దాకా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. ఆ తర్వాత నెమ్మదిగా మొదలైన వర్షం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.