ఇక అమెరికాకు వెళ్లలేం.. షాకిచ్చిన ట్రంప్..!

-

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయబోతున్నట్టు సమాచారం. అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా 23 లక్షల మందికిపైగా కరోనా వైరస్ బారినపడగా.. 1.22 లక్ష మంది మరణించారు. దీంతో కరోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ట్రంప్ స‌ర్కార్ అనేక చ‌ర్య‌లు తీసుకుంటుంది. దీనిలో భాగంగా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇత‌ర దేశాల నుంచి త‌మ దేశానికి వ‌చ్చే వ‌ల‌స‌లదారుల‌‌పై మూడు నెలలు తాత్కాలికంగా నిషేధం విధిస్తున్న‌ట్లు ఏప్రిల్‌లోనే ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే.

అయితే కరోనా వైరస్ తీవ్రంగా మారడంతో.. తాజాగా, ఈ నిషేధాన్ని డిసెంబరు వరకు పొడిగిస్తూ డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే హెచ్‌ 1బీ వీసాలపై ఆంక్షలు విధించనున్నట్టు, ఈ ఏడాది చివరి వరకు వీసాలను రద్దు చేస్తున్నట్టు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. కాగా వీసా నిబంధనలను సవరిస్తానని ట్రంప్‌ ఆదివారం ఫాక్స్‌ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నిబంధనలను కఠినం చేస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version